నంద్యాల ఎలక్షన్ తరవాత వైకాపా డీలా పడిన సంగతి తెలిసిందే, అది చాలా సాధారణం కూడా .. అయితే జగన్ మోహన్ రెడ్డి కంటే పార్టీ కేడర్ మాత్రమె ఎక్కువగా ఈ డిప్రెషన్ లో కనిపిస్తోంది. జగన్ మోహన్ రెడ్డి మాత్రం కాస్తంత పాజిటివ్ గా ఉంటూ , ఎక్కడా తగ్గడం లేదు అనిపిస్తోంది. ఫలితాలు వచ్చిన రెండు రోజులూ కాస్త చిరాకు లో ఉన్న జగన్ మళ్ళీ పుంజుకునే ప్రయత్నం చేస్తున్నారు.

తాజాగా వైఎస్సార్ ఫామిలీ , వై ఎస్ కుటుంబం అంటూ మొదలు పెట్టిన ఈ ప్రోగ్రాం మీద ఆయనతో పాటు పార్టీ కూడా చాలా సీరియస్ గా ప్రయత్నాలు చేస్తోంది. ఈ కార్యక్రమం లో భాగంగా వైకాపా అందరికీ ఒక నెంబర్ ని ఇస్తోంది, అది నేరుగా వైకాపా పార్టీ కార్యాలయం కి వెళుతుంది. సమస్య గురించి చెప్పుకోవాలి అంటే చెప్పుకోవచ్చు లేదా పార్టీ సభ్యత్వం కోసం మన డిటైల్స్ ఇవ్వాలి.

మన సమస్య ఏంటో చెబితే వాళ్ళు నోట్ చేసుకుంటారు. వైసిపి ప్రభుత్వం వచ్చాక దాని పరిష్కరిస్తారు. అలాగే కాల్ చేసిన వాళ్ళకి ఆటొమేటిగ్గా పార్టీ సభ్యత్వం వచ్చేస్తుంది. నాలుగు లక్షల మంది మొదటి రోజునే చేరారు అంటూ హ్యాపీగా ఉంది వైకాపా , ఈ స్కీం లో లోపాలు ఉన్నాయా అంటే కొందరు దీన్ని బూతద్దం లో చూస్తున్నారు అనిపిస్తోంది.

వైకాపా చెప్పిన సమస్యలని స్పాట్ లో పరిష్కరిస్తుందా అంటే కాదు ఎప్పుడు ఎలా చేస్తుంది అనేది ఇంకా చెప్పలేదు. సో ఆ ఒక్క క్లారిటీ ఇస్తే బాగుంటుంది అంటున్నారు చాలామంది. ఈ విషయం లో వైకాపా క్లారిటీ ఇస్తే వై ఎస్ కుటుంబం ప్రోగ్రాం సూపర్ డూపర్ హిట్ అవుతుంది అని ఖచ్చితంగా చెప్పచ్చు .