Jagan-venumadhav

కమెడియన్ గా వేణుమాధవ్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులు. తెలంగాణకు చెందిన వేణుమాధవ్ కు తెలుగురాష్ట్రాల్లో అభిమానులున్నారు. ఆయన కామెడీని ఎంతో పడతారు. తెలుగుదేశం పార్టీతో ఆయనకు అనుబంధం ఉన్న విషయం తెలిసిందే. గత ఎన్నికల్లో కోదాడ నుంచి పోటీ చేసేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. తాజాగా ఆయన నంద్యాల ఉపఎన్నికల ప్రచారంలో టీడీపీ తరపున పనిచేస్తున్నారు.

నంద్యాల ఉపఎన్నికల ప్రచారంలో పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్న సంగతి తెలిసిందే. వైసీపీ తరపున జగనే స్వయంగా టీడీపీ నేతలను టార్గెట్ చేసుకుని మాట్లాడుతున్నారు. ముఖ్యంగా సీఎం చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేసి జగన్ హాట్ పర్సన్ గా మారిపోయారు. ఇప్పుడు వేణుమాధవ్ కూడా జగన్ పై హాట్ కామెంట్స్ చేసి వార్తల్లో నిలుస్తున్నారు.

జగన్ పై వేణుమాధవ్ చేసిన వ్యాఖ్యలు వైసీపీలో ఆగ్రహం తెప్పిస్తున్నాయి. తనకు పేపర్, టీవీ లేవంటూ జగన్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన వేణుమాధవ్ ‘ నంద్యాలలో ఒక మూర్ఖుడు, బుద్దిలేనోడు నాకు టీవీ చానల్ లేదు.. పేపర్ లేదంటున్నాడు.. మరైతే ఆ ఛానల్, ఆ పేపర్ ఎవరిది బట్టేబాజ్..’ అన్నాడు. దీంతో టీడీపీ శ్రేణులు కూడా ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు.

అంతటితో ఆగని వేణుమాధవ్ ‘ నేను ఎవరినీ విమర్శింను. అది నా నైజం కాదు.. నా బిడ్డలు.. నా అన్న (భూమానాగిరెడ్డిని ప్రస్తావిస్తూ) కూతురు, కొడుకుల గురించి మాట్లాడుతుంటే … వాళ్ల గురించి నేను మాట్లాడడమా.. థూ.. నీచం.. నికృష్టం..’ అన్నారు. దీంతో టీడీపీ శ్రేణులు చప్పట్లతో హర్షాతిరేకాలు వ్యక్తం చేశాయి. మొత్తంగా వేణుమాధవ్ జగన్ పై చేసిన కామెంట్లతో టీడీపీలో జోష్ రాగా, వైసీపీ నేతలు మాత్రం ఫుల్ సీరియస్ గా ఉన్నారు.