నంద్యాల‌ ఉప ఎన్నిక, కాకినాడ కార్పోరేష‌న్ ఎన్నిక‌ల్లో గెలిచామ‌ని చంక‌లు గుద్దుకున్న టీడీపీకి షాక్‌ల మీద షాక్‌లు త‌గులుతున్నాయి. ముఖ్యంగా నంద్యాల గెలుపుతో టీడీపీలోకి నేత‌లు క్యూలు క‌డ‌తార‌నుకుంటే రివ‌ర్స్‌లో అనేక మంది నేత‌లు వైసీపీలో చేరుతున్నారు. ఇక వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ ప్ర‌క‌టించిన న‌వ‌ర‌త్నాల ప‌థ‌కంతో అనేక మంది నేత‌లు వైసీపీ గ‌డ‌ప తొక్కుతుంటే ఇప్పుడు తాజాగా విశాఖప‌ట్నం డుంబ్రిగుడ మండలంలోని గుంటగన్నెల పంచాయతీ పరిధిలో ఉన్న వివిధ పార్టీల నుంచి యువకులు పెద్ద సంఖ్యలో నాయకులు , పార్టీ కార్యకర్తలు వైసీపీలో చేరారు.

అరకునియోజక వర్గ సమన్వయకర్త చెట్టి పాల్గుణ వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా చెట్టి పాల్గుణ మాట్లాడుతూ గ‌త సార్వ‌త్రిక ఎన్నిక‌ల సంద‌ర్భంగా చంద్ర‌బాబు ఇచ్చిన హామీలు పరిష్కరించని కారణంగానే టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆ పార్టీని వీడి వైసీపీలో చేరుతున్నారని..చంద్రబాబు పాలనలో అభివృద్ది జరగడం లేదని అన్నారు. రానున్న కాలంలో టీడీపీ పార్టీ గిరిజన ప్రాంతంలో ఖాళీ అవుతుందని అన్నారు. గిరిజన గ్రామాల్లో అభివృద్ది జ‌ర‌గాలంటే అది ఒక్క జ‌గ‌న్‌కే సాధ్య‌మ‌ని చెప్పారు.