కాంగ్రెస్ పార్టీకి షాక్: జగన్ పార్టీలోకి కీలక నేత

ఏపీసీసీ కార్యదర్శి, విశాఖ కాంగ్రెస్ నేత, తుమ్మపాల షుగర్స్ మాజీ ఛైర్మన్ దంతులూరి దిలీప్ కుమార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను పార్టీ అధిష్ఠానానికి పంపారు. ఆయన వైసీపీలో చేరుతున్నట్టు తెలుస్తోంది. వైసీపీ అధినేత జగన్ ను కలిసేందుకు ఆయన తన అనుచరవర్గంతో కలసి జన్మభూమి ఎక్స్ ప్రెస్ లో విశాఖపట్నం నుంచి హైదరాబాద్ బయల్దేరారని సమాచారం.

గురువారం హైదరాబాద్‌లోని ఆ పార్టీ కార్యాలయంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకుంటారని తెలుస్తోంది. తన అనుచరులతో కలిసి హైదరాబాద్ వెళ్లారని అంటున్నారు. దిలీప్ కుమార్‌ కాంగ్రెస్‌ పార్టీలో సీనియర్‌ నేత. రెండుసార్లు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరపున పోటీ చేసి ఓడిపోయారు. కాంగ్రెస్‌ హయాంలో తుమ్మపాల షుగర్స్‌ పాలకవర్గం చైర్మన్‌గా పని చేశారు. 1995లో టీడీపీలో చేరిన ఆయన కొద్దిరోజులకే తిరిగి సొంత గూటికి చేరారు.