Ysrcp

ఏపీ రాజ‌కీయాల్లో సంచ‌ల‌నంగా మారిన నంద్యాల ఉప ఎన్నిక చివ‌రి అంకానికి చేరింది. ఇక జ‌గ‌న్ వ్యూహాల‌తో వైసీపీ దూసుకుపోతుండ‌గా టీడీపీ మాత్రం వెనుకంజ‌లో ఉంద‌నే చెప్పాలి. నంద్యాల‌లో టీడీపీ అనుకూల మీడియా అయితే శ‌త‌విధాల ప్ర‌య‌త్నించినా.. నంద్యాల‌లో టీడీపీకి మాత్రం మైలేజ్ తేలేక పోయింది.

దీంతో మ‌రో సారి టీడీపీ అనుకూల మీడియా చేసిన ప్ర‌య‌త్నం మ‌రోసారి బెడిసి కొట్టిద‌ని స‌మాచారం. అస‌లు విష‌యం ఏంటంటే నంద్యాల‌లో టీడీపీ అనుకూల మీడియా అన్ని వ‌ర్గాల వారిలో ప‌బ్లిక్ టాక్ నిర్వ‌హించింది. ఈ ప‌బ్లిక్ టాక్‌లో ప్ర‌జ‌ల నుండి వ‌చ్చిన స్పంద‌న చూసి ఎల్లో మీడియా వారు ఖంగుతిన్నారు. అక్క‌డ ముందుగా బ్రాహ్మ‌ణ వ‌ర్గాల వారి ద‌గ్గ‌రికి వెళ్ళ‌గా చంద్ర‌బాబుకు ఎట్టి ప‌రిస్థితిల్లో ఓటు వేయ‌మ‌ని.. అస‌లు టీడీపీ నంద్యాల‌లో గెలిచే అర్హ‌తే లేద‌ని తేల్చిచెప్పారు.

ఇక అక్క‌డ మెజారిటీ ఓట్లు ఉన్న ముస్లిం వ‌ర్గాల వ‌ద్ద‌కు వెళ్ళ‌గా.. చంద్ర‌బాబుకు మేము ఎన్నిక‌లు వ‌స్తేనే గుర్తొస్తాం.. గ‌తంలో రాజ‌శేక‌ర్ రెడ్డి గారు ఉన్న‌ప్పుడు ముస్లిల‌ను సొంత వారిగానే చూసే వారని.. ఇప్పుడు చంద్ర‌బాబు మాత్రం మాపై క‌ప‌ట ప్రేమ చూపిస్తున్నార‌ని.. చంద్ర‌బాబు ఎన్ని ప్ర‌లోభాలు చేసినా లొంగ‌మ‌ని ఖ‌చ్చితంగా వైసీపీని గెలిపించ‌డ‌మే కాకుండా వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబుని త‌రిమి కొట్టి జ‌గ‌న్‌ని సీఎం చేస్తామ‌ని చెప్పారు. ఇక ఆర్య వైశ్యులు అయితే మైక్ చిక్క‌గానే చంద్ర‌బాబును ఉతికి ఆరేశారు.

అస‌లు గ‌త ఎన్నిక‌ల్లో మేము జ‌గ‌న్‌ని న‌మ్మి వైసీపీని గెలిపించామ‌ని.. చంద్ర‌బాబు తాయిలాల‌కి లొంగి భూమా ఫ్యామిలి టీడీపీలోకి దూకి త‌గిన మూల్యం చెల్లించింద‌ని.. ఈ సారి కూడా నంద్యాల పీఠంపై వైసీపీ అభ్య‌ర్ధినే గెలిపిస్తామ‌ని చెప్పారు. ఇక అక్క అన్నిర‌కాల వ్యాపారాలు చేసే వారు.. టీడీపీ రౌడీయిజానికి విసుగెత్తి పోయామ‌ని ఖ‌చ్చితంగా వైసీపీకే ఓటు వేస్తామ‌ని తేల్చిచెప్పారు. ఇక అన్ని వ‌ర్గాల వారి నుండి టీడీపీకి వ్య‌తిరేకంగా ప‌బ్లిక్ మాట్లాడ‌డంతో స‌ద‌రు ఎల్లో మీడియా వారు చేసేదేంలేక అక్క‌డి నుండి జారుకున్నార‌ని స‌మాచారం.