అప్పట్లో అంటే 2004 లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బాగా యాక్టివ్ గా ఉండేది లోక్ సత్తా పార్టీ .. టీడీపీ , కాంగ్రెస్ , ప్రజారాజ్యం పార్టీ ఈ మూడు పార్టీ లూ ప్రధానంగా నిలిచినా కూడా 1.4 % ఓటు బ్యాంకు ని సాధించిన పార్టీ అది. గెలిచింది ఒకే ఒక్క ఎమ్మెల్యే సీటు అయినా కూడా ప్రజల్లో ఆ పార్టీ కి మంచి సపోర్ట్ సాఫ్ట్ కార్నర్ ఉండేది.

అయితే సరిగ్గా పదేళ్ళ తరవాత 2014 లో ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకుంటూ ఉన్నట్టు ప్రకటించారు ఆ పార్టీ అధ్యక్షులు జయ ప్రకాష్ నారాయణ. లోక్ సత్తా లో విభేదాలు ఉన్నాయ్ అనీ అందుకే ఈ నిర్ణయం అనీ వార్తలు వచ్చినా వాటి గురించి ఎవ్వరూ పట్టించుకోలేదు. ఈ పార్టీ గురించి ఇప్పుడు అందరూ మర్చిపోయిన పరిస్థితి లో సురాజ్య యాత్రలు అంటూ లోక్ సత్తా మళ్ళీ ముందరకి వచ్చింది.

ప్రజలలో చైతన్యం అంటూ యాత్ర పేరు పెట్టినా రాజకీయ యాత్ర గానే కనిపిస్తోంది. ఉన్నట్టుండి లోక్ సత్తా యాక్టివ్ అవ్వడానికి కారణం జనసేన పార్టీనే అంటున్నారు చాలా మంది. గత ఎన్నికల్లో టీడీపీ – బీజేపీ కి ప్రచారం చేసారు పవన్ కళ్యాణ్. ఈ సారి బీజేపీ తో కలిసే ఛాన్స్ లేనేలేదు అన్నారు ఆయన, పవన్ సొంత కూటమి తోనే నిలిస్తే గనుక ఆయనతో పాటు కలవచ్చు కదా అని ఫీల్ అవుతోంది లోక్ సత్తా పార్టీ.

నిజానికి, 2009 కంటే లోక్ సత్తా లాంటి పార్టీ లకి ఇప్పుడు మంచి పరిస్థితులు ఉన్నాయి. అప్పటితో పోలిస్తే ఇప్పుడు సోషల్ మీడియా ప్రభావం చాలా పెరిగింది. ఎక్కువ డబ్బు ఖర్చు లేకుండానే సోషల్ మీడియా ద్వారా ప్రజలకి దగ్గరయ్యే అవకాశం ఉందిప్పుడు. చూద్దాం, లోక్ సత్తా, జయ ప్రకాశ్ నారాయణ ల తదుపరి గమనం ఎలా ఉండబోతోందో!