నంద్యాల ఉప ఎన్నికలకు పోలింగ్ సమయం దగ్గర పడుతున్న కొద్ది టీడీపీ శ్రేణులకు ఓటమి భయం మరింత వ్యక్తం అవుతోంది.. 10 మంది మంత్రులు.. 30 మంది ఎమ్మెల్యేలు ..50 మంది అగ్ర నాయకులు ఇలా టీడీపీ ప్రభుత్వం మొత్తం నంద్యాలలో మకాం వేసి ప్రచారం చేస్తున్న లాభం లేకుండా పోతుంది..వైసీపీ తరపున జగన్ స్టార్ క్యాంపెయినర్‌గా ప్రచారాన్ని తనదైన శైలిలో దూసుకు పోతుండడంతో నిన్నటిదాకా టీడీపీకి ఫిఫ్టీ, ఫిఫ్టీ ఛాన్సులు ఉన్న గెలుపు అవకాశాలు క్రమంగా తగ్గిపోతున్నాయి..జగన్, శిల్పా బ్రదర్ప్ ముందు అఖిల ప్రియ, టీడీపీ మంత్రులు తేలి పోతున్నారు.. .ఇక చంద్రబాబు, లోకేష్‌లు వచ్చినా టీడీపీ పరిస్థితి మెరుగయ్యే అవకాశాలు కనిపించడంలేదు..

నంద్యాలలో ఎన్నికల సమయానికి వైసీపీ అభ్యర్థి శిల్పా భూమా బ్రహ్మానందరెడ్డిపై ఆధిపత్యం చెలాయించే అవకాశం ఉంది..ప్రచారంలో భాగంగా. వైసీపీ నుంచి జగన్, రోజాలు నంద్యాల ఎన్నికలను వచ్చే ఎన్నికలకు రిఫరెండంగా తీసుకుందాం అని చంద్రబాబుకు సవాలు విసిరారు..అయితే తాజాగా డిప్యూటీ సీఎం, కర్నూలు జిల్లా టీడీపీ సీనియర్ నాయకుడు కేఈ కృష్ణమూర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు..ఈ ఉప ఎన్నికలను తాము రెఫరెండంగా తీసుకోవడం లేదని, కేవలం సవాల్‌గా తీసుకున్నామని చెప్పారు. దీని బట్టి జగన్, రోజాలు అన్నట్లు టిడిపికి ఓటమి భయంతోనే రిఫరెండంగా అంగీకరించడానికి వెనకడుగు వేస్తున్నట్లు అర్థమవుతుంది..

నిజంగా చెప్పడం లేదు టిడిపి గెలుస్తుందా ఓడుతుందా అనే విషయాన్ని పక్కన పెడితే… తాము విజయం సాధిస్తామనే నమ్మకం ఉంటే కచ్చితంగా నంద్యాల ఉప ఎన్నికలను రెఫరెండంగా భావించేవారని, కానీ కేఈ మాత్రం ఓడిపోతామనే భయంతోనే అబ్బే. రెఫరెండం కాదు..సవాల్ మాత్రమే..మేము కచ్చితంగా గెలుస్తాయంటూ నర్మగర్భంగా వ్యాఖ్యలు చేశారు..పెద్దాయన మాటలను బట్టి చూస్తే నంద్యాలలో టీడీపీ గెలుస్తుందని ఆయనకు ఏ మాత్రం నమ్మకం లేదని..తద్వారా నంద్యాలలో టీడీపీ ఓటమిని కన్షర్మ్ చేసినట్లు టీడీపీ నేతలే గుసగుసలాడుకుంటున్నారు..

మరోవైపు నంద్యాలలో టీడీపీ ఓటమిని పెద్దాయనే కన్షర్మ్ చేశాడంటూ కేఈ వ్యాఖ్యలను వైసీపీ ప్రచార అస్త్రాలుగా మార్చుకుంటోంది..దీంతో ఎంత పని చేశావు పెద్దాయన అని అఖిల ప్రియ, భూమా బ్రహ్మానందరెడ్డితో సహా నంద్యాల తెలుగు తమ్ముళ్లు తలలు బాదుకుంటున్నారంట…ఇదిలా ఉండగా తన మనవరాలి వయసున్న అఖిల ప్రియ తనకు జిల్లాలో ఏమాత్రం మర్యాద ఇవ్వకపోవడంతో కినుక వహించిన కేఈ ఇలా టీడీపీని ముంచేలా వ్యాఖ్యలు చేశాడని కర్నూలు తెలుగు తమ్ముళ్లు భావిస్తున్నారు..