అనంతపురం టీడీపీ ఎంపీ జేసీ దివాక‌ర్‌రెడ్డితో పెట్టుకుంటే ఎవరికైనా గోసీ ఊడిపోవాల్సిందే…. తాజాగా ఆయన జగ‌న్‌కు మరో కాజా తినిపించారు… జగన్‌కు ఆ రెండు లేవంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు…. జ‌గ‌న్ ఒరిజిన‌ల్ రెడ్డి కాద‌ని, క‌న్వ‌ర్టెడ్ రెడ్డి అంటూ జేసీ ఘాటు వ్యాఖ్య‌లు చేశారు…న‌మ్మ‌కం, విశ్వాసం ఈ రెండింటి క‌ల‌యికే ఆరోగ్య‌క‌ర‌మైన రాజ‌కీయం…అయితే ఈ రెండు ల‌క్ష‌ణాలు జ‌గ‌న్‌లో లేవంటూ జేసీ దుమ్ము దులిపేశారు…

గ‌తంలో జ‌గ‌న్‌ను తాను ఏరా అని పిలిచేవాడిన‌ని, ఇప్పుడు సార్ అని ఎలా పిల‌వ‌గ‌ల‌న‌న్నారు జేసీ….రెడ్డి కులాన్ని జ‌గ‌న్ దెబ్బ‌తీస్తున్నాడంటూ జేసీ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. పేరు చివ‌ర రెడ్డి తోక‌ను చూసి జ‌గ‌న్‌ను అభిమానిస్తున్న‌వారు ఎంద‌రో ఉన్నార‌ని, అయితే తండ్రి శ‌వం ప‌క్క‌న పెట్టుకుని సంత‌కాల‌తో శ‌వ రాజకీయాలు చేసిన జ‌గ‌న్ రెడ్ల ప‌రువు తీశాడంటూ జేసీ ఘాటుగా వ్యాఖ్యానించారు.

అస‌లు జ‌గ‌న్ పార్టీలోకి వెళ్లిన కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌లు ఎక్క‌డా దిక్కు లేక వెళ్లార‌ని జేసీ ఎద్దేవా చేశారు… బొత్స, ధ‌ర్మాన లాంటివాళ్లను టీడీపీలోకి రానివ్వ‌క‌పోతే దిక్కుతోచ‌క వాళ్లు జ‌గ‌న్ ప‌క్క‌న చేరారంటూ జేసీ కుండ‌బ‌ద్ద‌లు కొట్టారు…అస‌లు వైసీపీ పార్టీనే కాద‌ని, జ‌గ‌న్ నాయ‌కుడే కాద‌ని, అత‌డిలో నాయ‌క‌త్వ ల‌క్ష‌ణాలు లేవ‌ని నిర్మొహ‌మాటంగా చెప్పేశారు జేసీ. త‌న తండ్రి వైఎస్ అనుచ‌రుల‌ను తానే ప‌ర్స‌న‌ల్‌గా క‌లిసి అడిగి ఉంటే టీడీపీ వ్య‌తిరేక వ‌ర్గాలు జ‌గన్ పార్టీలో చేరేవ‌ని,

అయితే 32 సీట్లు వ‌చ్చాయి క‌దా అని వాపు చూసుకుని బ‌లుపు అని జ‌గ‌న్ బోల్తా ప‌డ్డాడ‌న్నారు జేసీ… సానుభూతి క‌రిగిపోయాక జ‌గ‌న్ ప‌ర‌ప‌తి త‌రిగిపోయింద‌న్నారు ఆయ‌న‌.. జ‌గ‌న్ అహంకారం వ‌ల్లే త‌మ‌లాంటి మాజీ కాంగ్రెస్ నేత‌లు వైసీపీలోకి వెళ్ల‌లేద‌న్నారు జేసీ…. ఏపీకి చంద్ర‌బాబే దిక్క‌ని, ఇంకో గ‌త్యంత‌రం లేదంటూ జేసీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచ‌ల‌నం సృష్టిస్తున్నాయి… త‌న వ్యాఖ్య‌ల‌తో చీటికిమాటికి జ‌గ‌న్ గోసీ లాగేస్తున్న జేసీకి కౌంట‌ర్ ఇవ్వ‌లేక‌పోతోంది వైసీపీ.