ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌తో.. ఎన్నికల వ్యూహకర్త ప్ర‌శాంత్ కిషోర్ భేటీ అయ్యారు. నంద్యాల ఉపఎన్నిక, కాకినాడ కార్పొరేషన్ ఎన్నికలో ఓటమిపై లోతుగా విశ్లేషించుకోవ‌డంతో పాటు.. తరువాత అనుసరించాల్సిన కొత్త వ్యూహలు ర‌చించిన‌ట్టు స‌మాచారం. ఇక ప్రశాంత్ కిషోర్ కూడా తన ఆలోచనల్ని మరింత పదును పెడుతూ రాజకీయ రణరంగంలో వైసీపీని ఎలా అయిన కురుక్షేత్రంలో కృష్ణుడు మాదిరి గెలిపించాలని ప్రయత్నం చేస్తున్నాడని స‌మాచారం. అందులో భాగంగానే.. ఏపీ టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఓ సామాజిక వర్గానికి పట్టం కడుతోంద‌నే ఒక కీ పాయింట్‌ను జనాల్లోకి తీసుకెళ్లడానికి ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్న‌ట్టు స‌మాచారం.

2014 లో టీడీపీ అధికారంలోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుండి.. రాష్ట్రంలో ఉన్న‌ వివిధ శాఖలకు చెందిన అంటే ప్ర‌భుత్వ, ప్రైవేట్ రంగ‌లో ముఖ్య‌మైన ప‌ద‌వులు అన‌గా కన్సల్టెంట్లు, ప్రభుత్వ ప్లీడర్లు, అడ్వకేట్ జనరల్, స్టాండింగ్ కౌన్సిళ్ల వరకూ కమ్మ సామాజికవర్గానికే పట్టం కడుతున్నారని ఆధారాలతో బ‌య‌ట‌పెట్టి.. ఆవిష‌యాన్ని బ‌లంగా ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్ళి టీడీపీకి షాక్ ఇవ్వాల‌ని ప్రశాంత్ కిషోర్ సూచించినట్టు తెలుస్తోంది. దొంగ వాగ్దానాల‌తో అధికారం చేప‌ట్టిన చంద్ర‌బాబు.. ఒకే సామాజిక వర్గానికి అధికారం కట్టబెడుతూ మిగిలిన సామాజిక వర్గాలను పట్టించుకోవడం లేదని., ఇదే విషాయాన్ని ఆయా సామాజిక వర్గాల దృష్టికి తీసుకు వెళ్లేందుకు కసరత్తు ప్రారంభించింది.

ఇక టీడీపీ ప్రభుత్వం గత మూడున్నరేళ్ల నుంచి కీలక పదవులన్నీ టీడీపీ సామాజిక వ‌ర్గానికే ద‌క్కుతున్నాయ‌ని ముఖ్యంగా కోస్తా ప్రాంతంలో కీలకమైన పదవులు, అధికారుల నియామకాలు, అమరావతిలోని ఆ సామాజిక వర్గానికి చెందిన సంస్థలకు కేటాయించిన భూముల వివరాలు, పోలీసు రెవెన్యూ, మున్సిపల్, విద్యుత్, ఐటి, ఆర్ అండ్ బి, న్యాయ, పంచాయతీరాజ్ శాఖల్లో ఆ వర్గానికి ఇచ్చిన పోస్టింగులు, కట్టబెట్టిన కాంట్రాక్టుల వివరాలను సేకరించే పనిలో ఉందని అంటున్నారు. విజయవాడ, గుంటూరులోనే కాదు, శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు టీడీపీ సామాజిక వర్గ హవాకు మిగిలిన కులాలు నష్టపోతున్నాయన్న భావన అందరిలో ఉందని, ఒక వేళ కీలకమైన పోస్టుంగులు ఇచ్చినా.. అక్కడ ఎక్కువరోజులు ఉండనీయడం లేదని ఇతర కులాలకు చెందిన చాలామంది అధికారులు మొరపెట్టుకుంటున్నారనే వాదనలు వినిపిస్తున్నాయని అంటున్నారు.

ఇప్ప‌టికే జాబితా మొత్తం సిద్ధం అయ్యింద‌ని.. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఈ పరిస్థితి చాలా తీవ్రంగా ఉన్నట్లు గుర్తించామని, చాలా రోజులుగా చూస్తున్నామని, ఇక ఇప్పుడు ప్రజల దృష్టికి తీసుకు వెళ్లాల్సిందేనని, ఆ సామాజిక వర్గం వల్ల పోస్టింగులు, అవకాశాలు పోగొట్టుకున్న వారి జాబితాను బయటపెడతామని.. అయితే ఈ విష‌యాన్ని నేరుగా మీడియా ద్వారా వెళ్ళ‌డించాలా.. సోష‌ల్ మీడియా ద్వార తెలియ‌జేయాల అని కొంద‌రు మీడియా ప్ర‌ముఖుల‌ను సంప్ర‌దిస్తున్నామ‌ని వైసీపీ నేత‌లు చెబుతున్నారు. ఇక ప్ర‌శాంత్ కిషోర్ సూచించిన ఇదే పాయింట్‌ని ప్ర‌జ‌ల్లోకి వైసీపీ బ‌లంగా తీసుకెళ్ళ‌గ‌ల్గితే టీడీపీకి దిమ్మ‌తిరిగే షాక్ త‌గ‌ల‌డం ఖాయ‌మ‌ని స‌ర్వ‌త్రా చ‌ర్చించుకుంటున్నారు.