నంద్యాల ఉప ఎన్నిక నీ కాకినాడ కార్పరేషన్ నీ వైకాపా ఎంత ప్రతిష్టాత్మకం గా తీసుకుందో అంతటి ప్లాప్ షో ని ఇచ్చింది. ఈ ఓటమి కి వైకాపా ఎలా ప్లాన్ చేసిందో ఎక్కడా కనపడలేదు, వినపడలేదు. అసలు వారు ఈ ఓటమి పట్ల మనసులో ఏమి అనుకుంటున్నారు అనేది ఎక్కడా రాలేదు.

వై ఎస్సార్ ఫామిలీ అనే కార్యక్రమం పెట్టి వైకాపా శ్రేణులు అందరినీ అటువైపు లాగేశారు జగన్ మోహన్ రెడ్డి .. ఈ కార్యక్రమం గ్రాండ్ గా మొదలు పెట్టబోతున్నారు. మరొక పక్క టీడీపీ నుంచి కవ్వింపులు పెరుగుతున్నాయి.

తమ పార్టీ తో ఎవరు ఉన్నారు లేరు అనేది వైకాపా కి క్లారిటీ లేకపోవడమే ఈ పరిస్థితికి కారణం అనీ అందుకే వై ఎస్సార్ కుటుంబం అంటూ ప్రోగ్రాం లు నడుపుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అని వారు అంటున్నారు.

మరొక పక్క లండన్ లో ఉన్న జగన్ ఇండియా ఒచ్చేలోగా ఒక‌రిద్ద‌రు వైకాపా నుంచి టీడీపీలోకి జంప్ అయ్యే అవ‌కాశాలున్నాయంటూ పార్టీ శ్రేణుల్లోనే ఆందోళ‌న వినిపిస్తోందంటూ ఓ క‌థ‌నం ప్ర‌చారంలోకి వ‌చ్చింది. నంద్యాల‌, కాకినాడ ఫ‌లితాల అనంత‌రం ఇంకా వైకాపాలోనే కొన‌సాగితే భ‌విష్య‌త్తు ఉండ‌ద‌నే స్ప‌ష్ట‌తకు కొద్దిమంది నేత‌లు వ‌చ్చేశార‌నీ, జ‌గ‌న్ లేని స‌మ‌యం చూసి టీడీపీతో వారంతా ట‌చ్ లోకి వెళ్లే అవ‌కాశాలున్నాయంటూ గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.