ఏపీలో జ‌గ‌న్ పాద‌యాత్ర‌కు సిద్ద‌మ‌వుతున్న తరుణంలో వైసీపీ ప్లీన‌రీలో ప్ర‌క‌టించిన తొమ్మిది అంశాల‌ను ప్ర‌జ‌ల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు వైఎస్ఆర్ గుర్తుగా – జ‌గ‌న్ కు తోడుగా అనే పేరుతో 60 రోజుల కార్య‌ాచ‌ర‌ణ‌ను ప్ర‌శాంత్ కిషోర్ రూపొందించారు. అందులో భాగంగా మొద‌టి విడ‌త‌లో న‌వ‌ర‌త్నాల స‌భ‌లు, ఆ త‌ర్వాత వైఎస్ఆర్ కుటుంబం విజ‌య శంఖరావం పేరుతో కార్యక్ర‌మాల‌ు నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించారు.

ప్రతి ఒక్క బూతు స్థాయి నాయకుడు టిడిపి చేసే అవినీతి గురించి అరాచకాల గురించి సవివరంగా వివరిస్తారని పార్టీ నాయకులు తెలియచేసారు. ఒక్కో గ్రామంలో 10 మంది బూత్ కమిటీ సభ్యులు ఉంటే ఒక్కొక్కరు రోజుకు కనీసం రెండు కుటుంబాలను కలసి మూడున్నర సంవత్సరాలలో టిడిపి ప్రభుత్వం చేసిన అరాచకాలను ఎండ కట్టి వైఎస్ఆర్‌ కుటుంబంలో ప్రతి ఒక్క కుటుంబాన్ని చేర్చే విధంగా పక్కా ప్రణాళిక రూపొందించారు.

వైఎస్సార్ కుటుంబంలో చేరడానికి 9121091210 నంబర్ కు మిస్డ్ కాల్ ఇచ్చిన వెంటనే పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గొంతుతో ఒక రిటర్న్ కాల్ వచ్చి చంద్రబాబు చేస్తున్న అక్రమాలు అన్ని సవివరంగా జగన్ వివరిస్తాడు. ఇక ఈ కార్యక్రమంలోనే ప్రతి ఒక్క కుటుంబానికి వైఎస్ జగన్ ప్లీనరీలో ప్రకటించిన నవరత్నాల గురించి తెలియచేసి వాటి వల్ల జరిగే లబ్ది గురించి సవివరంగా వివరిస్తారు.

ఈ విధంగా వైఎస్ జగన్ పాదయాత్ర ముందే ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని సంకల్పించారు. ఇక ఇప్పటికే జగన్ ప్రకటించిన నవరత్నాలు, అన్నవస్తున్నాడు స్లోగన్ తో రాష్ట్ర వ్యాప్తంగా బారి స్పందన రావడంతో రెట్టించిన ఉత్సాహంతో ఇతర పార్టీలో నాయకులూ జగన్ పాదయాత్రలో చేరడానికి సిద్ధమయ్యారని తెలుస్తోంది. ఇక జగన్ పాదయాత్ర సమయానికి ఇంకెన్ని సంచలనాలు నమోదవుతాయో అని వైసీపీ శ్రేణుల్లో ఉత్సాహంలో మునిగిపోయారు.