వైసీపీలోకి కాంగ్రెస్ సీనియ‌ర్ నేత

వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వ‌ల‌స‌ల ప‌రంప‌ర కొన‌సాగుతోంది.. ఇప్ప‌టికే ప‌లు జిల్లాల్లో కాంగ్రెస్ నుంచి సీనియ‌ర్ నాయ‌కులు వైసీపీ తీర్ధం పుచ్చుకోగా, మిగిలిన నాయ‌కులు కూడా వైసీపీలో చేరేందుకు రెడీ అవుతున్నారు.. తాజాగా కాంగ్రెస్ పార్టీ నాయ‌కుడు, పీసీసీ కార్య‌ద‌ర్శి, తుమ్మపాల షుగర్స్‌ మాజీ చైర్మన్‌ దంతులూరి దిలీప్‌కుమార్‌ కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేశారు.. ఈమేర‌కు ఆయ‌న త‌న రాజీనామా లేఖ‌ను అధిష్టానానికి పంపారు..

నిన్నసాయంత్రం త‌న అనుచ‌రుల‌తో భేటీ అయిన దిలీప్ కుమార్, వారి అభిప్రాయం ప్ర‌కారం వైసీపీలో చేరేందుకు రెడీ అయ్యారు.. ఈరోజు వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయ‌స్ జ‌గ్మోహ‌న్ రెడ్డి స‌మ‌క్షంలో, వైసీపీలో చేరేందుకు ఆయ‌న సిద్దం అయిన‌ట్టు తెలుస్తోంది..

దిలీప్‌కుమార్‌ కాంగ్రెస్‌ పార్టీలో సీనియర్‌ నేత. రెండుసార్లు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరపున పోటీ చేసి ఓటమి పాల‌య్యారు.. కాంగ్రెస్‌ హయాంలో తుమ్మపాల షుగర్స్‌ పాలకవర్గం చైర్మన్‌గా పనిచేశారు. 1995లో తెలుగుదేశం పార్టీలో చేరిన ఆయన కొద్దిరోజులకే తిరిగి సొంత గూటికి చేరారు. ప్రస్తుతం పీసీసీ కార్యదర్శిగా ప‌నిచేస్తున్నారు..

ఉత్త‌రాంధ్రా వైసీపీ నాయ‌కుడు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, వైసీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్ కొద్ది రోజుల క్రితం తుమ్మపాలలోని దిలీప్‌కుమార్‌ ఇంటికి వెళ్లి ఆయ‌న్నివైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని కోరారు దీంతో జ‌గ‌న్ పాద‌యాత్ర‌కు ముందే, వైసీపీలో చేరాల‌ని దిలీప్‌కుమార్‌ నిర్ణ‌యించుకున్నారు.