టాలీవుడ్ బాక్సాఫీస్‌కి బాస్‌గా వెలుగొందిన చిరంజీవి 2009 ప్రజారాజ్యం స్థాపించిన తరువాత కొన్ని రోజులకే కాంగ్రెస్ లోకి విలీనం చేసి ఇప్పుడు అక్కడ రాజ్యసభ సీటు పొందిన విష‌యం తెలిసిందే. అయితే ఇటీవ‌ల ఖైదీ 150తో రీ ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి మ‌ళ్ళీ సినిమాలలో బిజీ అయిపోయారు. ఇక విడిపోయిన ఆంధ్రప్రదేశ్ విడిపోయాల ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి తెలిసిందే. వ‌చ్చే మార్చి త‌ర్వాత ఆయ‌న ఏ పార్టీలో ఉంటార‌నే విష‌యం పై రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ న‌డుస్తోంది.

ఇక 2019 లో సార్వత్రిక ఎన్నికల కోసం చిరంజీవిక‌ టీడీపీ, వైసీపీ పార్టీల నుంచి రాజ్యసభ ఆఫర్స్ వచ్చినట్లు వినికిడి. ఇప్ప‌టికే టీడీపీ త‌ర‌పున ఆయ‌న‌కు ఓ ఆఫ‌ర్ ఇచ్చార‌ని తెలుస్తోంది. చిరుకి స‌న్నిహితంగా ఉండే మంత్రి గంటా శ్రీనివాస‌రావు ఇప్ప‌టికే ఓ ప్ర‌పోజ‌ల్ పెట్టిన‌ట్లు తెలుస్తోంది. కానీ చంద్రబాబు గురించి తెలిసి ఆ పార్టీలో చేరడానికి చిరంజీవి అంత సుముఖత చూపడం లేద‌ని స‌మాచారం. ఇక వైసిపిలోకి వస్తాడా, రాడా అన్న విషయం పక్కన పెడితే ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తరువాత చిరంజీవి అసెంబ్లీలో వైఎస్ గురించి ఎంతో భావోద్వేగంతో మాట్లాడాడు వైఎస్ చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే కాంగ్రెస్‌ను గెలిపించాయని చెప్పిన విష‌యం అంద‌రికీ తెలిసిందే.

ఇక ఇప్పుడు జగన్ కూడా నవరత్నాలు పేరుతో అచ్చం వైఎస్ ప్రవేశ పెట్టిన పథకాలనే ప్రజల ముందుకు తీసుకొని వెళుతూ ఎలా అమలు చేయవచ్చు అనే విషయాలు ప్రజలలోకి తీసుకొని వెళుతూ ముందుకు సాగుతున్నాడు. టీడీపీ 2014 ఇచ్చిన ఒక్క హామీని కూడా అమలు చేయలేదు. ఇక కాపులని బీసీలలో చేరుస్తానని చెప్పి మోసం చేయడం, ముద్రగడ చేస్తున్న పాదయాత్రను అణచి వేయ‌డం..

ఇలాంటి ప‌రిస్థితుల మ‌ధ్య చిరంజీవి వైసీపీ వైపే మొగ్గు చూపుతాడని జ‌గ‌న్ త‌న‌కి ఇవ్వాల్సిన గౌర‌వం ఇస్తాన‌ని హామీ ఇస్తే చిరంజీవి వైసీపీలోకి వెళ్ళే అవ‌కాశాలే ఉన్నాయ‌ని తెలుస్తోంది. ఇక చంద్రబాబు తీరు.. ఒకే మాటను పది మందికి చెప్పి అవసరాలకు వాడుకుంటారన్న అపోహల మధ్యలో చిరంజీవి రాజ‌కీయ‌ ప్రస్థానం ముగియ‌క‌పోతే.. వైసీపీలోనే ఉంటుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే కచ్చితంగా చిరంజీవి కాంగ్రెస్ నుంచి బయటకు రావడం మాత్రం ఖాయంగా కనపడుతుంది. ఇక ఈ మెగాస్టార్ ఏ పార్టీలో తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెడతారనేది త్వ‌ర‌లోనే తేల‌నుంద‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చించుకుంటున్నారు.