నిన్నటివ‌ర‌కుపార్టీల‌కుఎంపీలవ‌ల‌స‌లుభ‌యంప‌ట్టుకుటె.ఇప్పుడుటీడిపీకిఎమ్మెల్సీలభ‌యంప‌ట్టుకుంది.ఎమ్మెల్సీల గండంగా మారిపోయిందని సర్వత్రా చర్చ నడుస్తోంది.ఇప్ప‌టికే అధికార పార్టీని కాద‌ని ప్ర‌తిప‌క్ష‌పార్టీలోకి వ‌ల‌స‌లు ప్రారంభ‌మ‌య్యాయ‌నె సంగ‌తి తెలిసిందే.అయితే ఇప్పుడు మ‌రో ఎమ్మెల్సీ బాబుకు షాక్ ఇవ్వ‌నున్నార‌నె వార్త‌లు హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి.

ఇప్ప‌టికే ముగ్గురు ఎమ్మెల్సీలు పార్టీని వీడారు. వాల్ల‌లో అవినీతి ఆరోప‌న‌ల నేప‌థ్యంలో ఎమ్మెల్సీ వాకాటి నారాయ‌ణ‌రెడ్డి, దీప‌క్‌రెడ్డిని పార్టీ స‌స్పెండ్ చేసింది.అలాగే మొన్నటికి మొన్న శిల్పా మోహన్ రెడ్డి పార్టీని వీడిపోవడం దీనికి ఉదాహరణలుగా చెప్పుకుంటున్నారు. ఇలాంటి నేపథ్యంలో.. చంద్రబాబు నాయుడు పదవి కట్టబెట్టిన మరో ఎమ్మెల్సీ కూడా పార్టీని వీడబోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.

ప్రకాశం జిల్లాలో కీలక నాయకుడు మాజీ ఎంపీ ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న మాగుంట శ్రీనివాసులు రెడ్డి కూడా వైకాపా తీర్థం పుచ్చుకోవడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నట్లుగా పుకార్లు వస్తున్నాయి.గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అనుకూలంగా లేకపోవడంతో సరిగ్గా ఎన్నికల ముందు తెలుగుదేశంలో చేరి.. ఎంపీగా బరిలోకి దిగారు. వైకాపా చేతిలో ఓటమి తప్పలేదు.కొన్నాళ్లకు ఆయనకు చంద్రబాబు ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టారు. నిజానికి మాగుంట శ్రీనివాసులు రెడ్డి మంత్రి పదవిని కూడా ఆశించినప్పటికీ రకరకాల కాంబినేషన్ల నేపథ్యంలో కుదర్లేదు.

మొత్తానికి చాన్నాళ్లుగా మాగుంట శ్రీనివాసులురెడ్డి తెలుగుదేశం అధినాయకత్వం పట్ల అసంతృప్తితో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. ఆయన కొన్నాళ్లుగా పార్టీ కార్యకలాపాలకు కూడా దూరంగా ఉన్నారని అనుకుంటున్నారు. ఆయన పార్టీని వీడబోతున్నట్లుగా కొంత కాలం నుంచి వైకాపా లో చేరడానికి ఆ పార్టీ పెద్దలతో రాయబారాలు నడుపుతున్నట్లుగా తెలుస్తోంది.