Roja-adinarayana

ఏపీలో కర్నూలు జిల్లా నంద్యాల అసెంబ్లీ నియోజక వర్గ ఉప ఎన్నికల ప్రచారంలో ఇటు అధికార పార్టీ అయిన తెలుగుదేశం ,అటు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ పార్టీలకి చెందిన నేతల విమర్శల పర్వం రోజుకో మలుపు తిరుగుతున్నాయి .ఈ నెల 23న జరగనున్న ఉప ఎన్నికల్లో అధికార తెలుగుదేశం పార్టీ తరపున భూమా బ్రహ్మానందరెడ్డి ,ప్రతిపక్ష వైసీపీ పార్టీ తరపున మాజీ సీనియర్ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి బరిలోకి దిగుతున్నారు .

ఈ నంద్యాల ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా వైసీపీ తరపున గెలిచి టీడీపీలో చేరి మంత్రి పదవిని అనుభవిస్తోన్న మంత్రి ఆదినారాయణ రెడ్డి ఏపీ ఫైర్ బ్రాండ్ వైసీపీ మహిళ ఎమ్మెల్యే ఆర్కే రోజా మీద తన నోటి దురుసును ప్రదర్శించారు .ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే ఆర్కే రోజాను ఉద్దేశించి రోజాలాంటి వారు వస్త్రధారణపై మాట్లాడ‌డం హాస్యాస్ప‌దంగా ఉంద‌ని అన్నారు. బట్టలు లేకుండా తిరిగే వాళ్లకు వస్త్రధారణపై మాట్లాడే అర్హత లేదని ఆయన సంచ‌లన వ్యాఖ్య‌లు చేశారు.

అయితే గత మూడున్నర ఏండ్లుగా మహిళలు అంటే ఏమాత్రం గౌరవం లేకుండా వ్యవహరిస్తోన్న అధికార టీడీపీ నేతల నోటి నుండి ఇంతకంటే మంచి మాటలు ఏమి వస్తాయి .కాల్ మనీ వ్యవహారం ద్వారా ఆడవారి బ్రతుకులను నాశనం చేయడమే కాకుండా రోడ్డున నిలబెట్టిన ,మహిళ అని చూడకుండా అధికారిపై దాడులు చేసిన నేతలున్న టీడీపీ లో మహిళలకి ఏ మాత్రం గౌరవం ,రక్షణ ఉంటుందో అర్ధమవుతుంది అని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నారు ..