80 సీట్ల‌లోనే పోటీ…. చేతులు ఎత్తేసిన వైసీపీ

స‌మైక్య రాష్ట్రంలో అధికారంలోకి వ‌చ్చేస్తాన‌ని బీరాలు ప‌లికిన వైసీపీ అధినేత వైఎస్‌.జ‌గ‌న్ ఇప్పుడు ఏపీలో ప్ర‌తిప‌క్ష పాత్ర‌కూడా పోషించ‌లేక చేతులు ఎత్తేస్తున్నాడు. గ‌త ఎన్నిక‌ల్లో తెలంగాణ‌లో కేవ‌లం 3 ఎమ్మెల్యే, 1 ఎంపీ సీటు గెలుచుకున్నా ఇప్పుడు వాళ్లంతా జ‌గ‌న్‌కు టాటా చెప్పేసి అధికార టీఆర్ఎస్‌లో చేరిపోయారు. ఇదిలా ఉంటే ఎన్నిక‌ల త‌ర్వాత జ‌గ‌న్‌కు తెలంగాణ‌లో ఒక్క ప్ర‌జాప్ర‌తినిధి లేకుండా పోయాడు. ఇక ఏపీలోను ఏకంగా 21 మంది ఎమ్మెల్యేలు టీడీపీలో చేరిపోయారు.

పార్టీ ప్ర‌తిప‌క్షంలో ఉన్న ఏపీలోనే వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆ పార్టీ త‌ర‌పున అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లోను ఎంపీ, ఎమ్మెల్యే అభ్య‌ర్థులు దొరికే ప‌రిస్థితి లేక‌పోతే ఇక ఏం లేని తెలంగాణ‌లో ఎంత దీనావ‌స్థ‌లో ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. ఏపీలో అయితే నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జ్‌లు కూడా తాము వైసీపీ నుంచి వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌మ‌ని చెప్పేస్తున్నారు. ఇప్ప‌టికే ద‌ర్శి, విజ‌య‌న‌గ‌రం ఇన్‌చార్జ్‌లు తాము వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌మ‌ని జ‌గ‌న్‌కు చెప్పేయగా ఈ బాట‌లోనే మ‌రికొంద‌రు ఉన్నారు.

ఇదిలా ఉంటే తెలంగాణ‌లో వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌మ పార్టీ కేవ‌లం 80 సీట్ల‌లోనే పోటీ చేస్తుంద‌ని ఆ పార్టీ నాయ‌కులు ఇప్ప‌టికే ప్ర‌క‌టించేశారు. పార్టీ అధినేత జ‌గ‌న్ ఏపీలోనే పార్టీని న‌డిపించ‌లేక‌పోతున్నాడు. ఇక ఆయ‌న‌కు తెలంగాణలో పార్టీని ప‌ట్టించుకునే తీరిక ఎక్క‌డ మాత్రం ఉంటుంది. వైసీపీలో పోటీపై ఆ పార్టీ చేతులెత్తేసే ప్ర‌క‌ట‌న చేసేసింది. వైసీపీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌ రెడ్డి వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ 80 స్థానాల్లో పోటీ చేస్తుందని ఓ ఆంగ్ల పత్రికకు చెప్పారు.

ఇక 80 స్థానాల్లో పోటీ చేస్తే ఒక్క సీటు కూడా గెలిచే ప‌రిస్థితి లేద‌ని ఆ పార్టీకే అర్థ‌మైపోయింది. కేసీఆర్ దెబ్బ‌కు అక్క‌డ ప్ర‌తిప‌క్షాలే ఆగ‌లేక‌పోతున్నాయి. ఇక వైసీపీ ఎంత‌..? వ‌చ్చే ఎన్నిక‌ల వ‌ర‌కు అక్క‌ర్లేకుండా అంత‌కు ముందే వైసీపీ తెలంగాణ‌లో మూత‌ప‌డ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.