విల్లు నుంచి సంధించిన బాణం, గన్ను నుంచి పేలిన గుండు, వాట్సాప్‌లో సెండ్‌ బటన్‌ కొట్టాక మెసేజ్‌ వెనక్కి తీసుకోలేం. మొదటి రెండు కష్టం కానీ… మూడోది త్వరలో సాధ్యమవుతుంది. చాలా రోజుల నుంచి చెబుతున్న రీకాల్‌/రీవోక్‌ ఆప్షన్‌ అతి త్వరలో వాట్సాప్‌లోకి రాబోతోంది. అయితే దీన్ని ‘డిలీట్‌ ఫర్‌ ఎవ్రీవన్‌’ అంటున్నారు. ఈ తరహా ఆప్షన్‌ చాలా రోజుల నుంచి టెలీగ్రామ్‌, వైబర్‌లో ఉంది.

ఈ ఆప్షన్‌ ద్వారా మనం పంపిన మెసేజ్‌ను అవతలి వ్యక్తి చూడనంత వరకు.. అంటే బ్లూ టిక్‌ రానంత వరకు దాన్ని అతని మొబైల్‌ నుంచి డిలీట్‌ చేసేయొచ్చు. అలా చేస్తే నోటిఫికేషన్స్‌ ప్యానల్‌లోనూ డిలీట్‌ అయిపోతుంది. ప్రస్తుతం ఈ ఆప్షన్‌ను ప్రయోగాత్మకంగా కొందరికి మాత్రమే అందుబాటులోకి తెచ్చారు. త్వరలో అందరూ దీన్ని వాడుకోవచ్చు.