ఉప్పల్‌లో టీ20 సాగేనా…!

భారత్‌-ఆస్ట్రేలియా సిరీస్‌ను వరుణుడు వెంటాడుతున్నాడు. రాంచిలో జరిగిన తొలి టీ20కి వర్షం తీవ్ర అంతరాయం కలిగించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు శుక్రవారం హైదరాబాద్‌ ఆతిథ్యమివ్వబోయే మూడో టీ20కి కూడా వరుణుడి ముప్పు పొంచి ఉంది. గత కొన్ని రోజులుగా హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

మహారాష్ట్రతో హైదరాబాద్‌ రంజీ మ్యాచ్‌ వర్షం వల్లే రద్దయింది. శుక్రవారం నాటి టీ20కి కూడా వరుణుడు ఆటంకం కలిగించేందుకు ఆస్కారముంది. బుధవారం సాయంత్రమూ వర్షం పడింది. పిచ్‌ను కవర్లతో కప్పి ఉంచారు. భారత్‌, ఆస్ట్రేలియా జట్లు ప్రత్యేక విమానంలో ఇప్పటికే హైదరాబాద్‌ చేరుకున్నాయి. గురువారం సాధన చేయాలని భావిస్తున్నాయి.