బోర్డు ప్రెసిడెంట్స్‌ ఎలెవన్‌తో జరిగిన సన్నాహక మ్యాచ్‌లో ఆసీస్‌ అదరగొట్టింది. భారత పర్యటనలో భాగంగా ఆసీస్‌-బోర్డు ప్రెసిడెంట్స్‌ ఎలెవన్‌ మధ్య మంగళవారం సన్నాహక మ్యాచ్‌ నిర్వహించారు. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన స్మిత్‌ ముందుగా బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. నిర్ణీత 50 ఓవర్లలో ఆసీస్‌ 7 వికెట్ల నష్టానికి 347 పరుగులు చేసింది. నలుగురు ఆసీస్‌ ఆటగాళ్లు అర్ధశతకాలు నమోదు చేశారు. భారత బౌలర్లు వాషింగ్టన్‌ సుందర్‌, పటేల్‌ చెరో రెండు వికెట్లు తీశారు.

ఓపెనర్‌ కార్ట్‌రైట్‌ని పరుగుల ఖాతా తెరవనీయకుండానే రెండోఓవర్‌లో అవేశ్‌ ఖాన్‌ పెవిలియన్‌కు పంపాడు. ఆ తర్వాత వచ్చిన స్మిత్‌ మరో ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌తో కలిసి పరుగులు రాబట్టాడు. ఇద్దరూ కలిసి రెండో వికెట్‌కి 105 పరుగులు జోడించారు. వార్నర్‌(64) (48 బంతుల్లో) ఔటుకావడంతో క్రీజులోకి వచ్చిన హెడ్‌(65) కూడా రాణించాడు. దీంతో ఆసీస్‌ జట్టు భారీ స్కోరు సాధించింది. స్మిత్‌(55), స్టొయినీస్‌(76) కూడా మెరుగైన ప్రదర్శన చేశారు. చివర్లో వచ్చిన వేడ్‌(45, 24బంతుల్లో) భారత బౌలర్లపై విరుచుకుపడ్డాడు. దీంతో ఆ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 347 పరుగులు చేసింది. 348 పరుగులతో బోర్డు జట్టు బరిలోకి దిగింది.

4 ఓవర్లు ముగిసే సమయానికి ఎలెవన్‌ జట్టు వికెట్‌ నష్టానికి 10పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో గోస్వామి, మయాంక్‌ అగర్వాల్‌ ఉన్నారు.