లేడీస్‌ వాష్‌రూంలోకి వెళ్లిన రాహుల్‌….!

కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీకి.. ప్రధాని మోదీని, భాజపాని ఎలా టార్గెట్‌ చేయాలా అని ఆలోచించడంతోనే సరిపోతున్నట్లుంది. ప్రసంగ సమయాల్లోనే కాదు ఖాళీ సమయాల్లోనూ ఇదే ఆలోచిస్తున్నట్టున్నారు. అందుకే ఏదో ఆలోచిస్తూ పొరపాటున లేడీస్‌ వాష్‌రూంలోకి వెళ్లారు.

ప్రస్తుతం రాహుల్‌ గుజరాత్‌లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. బుధవారం చోటా ఉదయ్‌పూర్‌ జిల్లాలో నిర్వహించిన ‘సంవాద్‌’ అనే కార్యక్రమంలో రాహుల్‌ పాల్గొన్నారు. కార్యక్రమం పూర్తయ్యాక హాల్‌ నుంచి బయటికి వెళ్లే క్రమంలో పొరపాటున లేడీస్‌ వాష్‌రూంలోకి వెళ్లిపోయారు. బయట ఎలాంటి బోర్డు పెట్టకపోవడంతో రాహుల్‌ కన్‌ఫ్యూజయ్యారు. దాంతో రాహుల్‌ని చూసి అక్కడున్నవారంతా నవ్వు ఆపుకోలేకపోయారట.

అయితే వాష్‌రూం తలుపు వద్ద లేడీస్‌ టాయ్‌లెట్‌ అని గుజరాతీలో రాసుందని.. భాష రాక రాహుల్‌ అర్థంచేసుకోలేకపోయారని ప్రతినిధులు తెలిపారు. ఈ విషయం గురించి మీడియా రాహుల్‌ని ప్రశ్నించినా ఏమీ మాట్లాడకుండా వెళ్లిపోయారట.