గూగుల్‌ మ్యాప్స్‌లో ఓ ప్రాంతం గురించి వెతికి చూశారు. అక్కడ వచ్చిన శోధన ఫలితాలు అసంపూర్తిగా ఉన్నాయనిపించింది. అప్పుడు మీరు ఏ స్నేహితుడినో అడిగి సందేహం నివృత్తి చేసుకుంటారు. ఇకపై ఆ అవసరం లేదు. గూగుల్‌ మ్యాప్స్‌లోనే ప్రశ్న- జవాబుల ఆప్షన్‌ను ప్రవేశపెట్టారు.

అందులో మీ సందేహాన్ని ప్రశ్న రూపంలో అందిస్తే… గూగుల్‌ కమ్యూనిటీల నుంచి సమాధానం వస్తుంది. ఉదాహరణకు మ్యాప్స్‌లో చార్మినార్‌ గురించి వెతికి చూశారు. అక్కడ వచ్చిన వివరాల్లో దాని ప్రవేశ రుసుము గురించి ప్రస్తావించలేదు. ఆ ప్రశ్నను అక్కడి బాక్స్‌లో రాస్తే… మీకు సమాధానం వచ్చేస్తుంది.