చౌటుప్పల్‌: కోట్ల రూపాయల విలువైన సిగరెట్ల లోడుతో వెళ్తున్న కంటైనర్‌ను సినీఫక్కీలో అపహరించి సరుకును దొంగిలించుకుపోయిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలంలో చోటుచేసుకుంది. హైదరాబాద్‌లోని ముషీరాబాద్‌ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతికి సిగరెట్ల లోడుతో వెళ్తున్న కంటైనర్‌ను అబ్దుల్లాపూర్‌మెట్‌ ఔటర్‌ రింగ్‌రోడ్‌ వద్ద కొందరు దుండగులు అడ్డగించారు.

అనంతరం లారీలోకి ఎక్కి డ్రైవర్‌ను బంధించి చౌటుప్పల్‌ మండలం మల్కాపూర్‌ శివారుకు తరలించారు. కంటైనర్‌ డ్రైవర్‌ను సమీపంలోని గుట్టలోకి తీసుకెళ్లి వదిలేసి.. సిగరెట్ల లోడును తమ వాహనాల్లోకి ఎక్కించుకుని పరారయ్యారు. అనంతరం డ్రైవర్‌ తేరుకుని ఈ ఘటనపై చౌటుప్పల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. డ్రైవర్‌ చెప్పిన వివరాలను కంటైనర్‌ జీపీఎస్‌తో నిర్ధారించుకున్న చేసుకున్న పోలీసులు దుండగుల కోసం గాలింపు చేపట్టారు.