దిల్లీ: దేశ రక్షణ చర్యల్లో పాల్గొనే ప్రత్యేక బలగాలకు ఎయిర్‌ కండీషన్డ్‌ జాకెట్లను కేంద్రం అందించనుంది. ఇందుకోసం కార్యాచరణ కూడా ప్రారంభించింది. అయితే వీటి తయారీకి ఏం వాడుతున్నారు, ఎలాంటి సాంకేతికత వినియోగిస్తున్నారన్న విషయాలను మాత్రం వెల్లడించలేదు.

‘ప్రత్యేక ఆపరేషన్‌లో పాల్గొనే సైనికుల శరీరాలు వెంటనే వేడెక్కుతాయి, అసౌకర్యానికి లోనవుతారు. అందుకే వారికి సౌకర్యంగా ఉండేందుకు ఏసీ జాకెట్లను వారికి అందించాలని అనుకున్నాం. వాటికి సంబంధించిన ట్రయల్స్‌ జరుగుతున్నాయి.’ అని గోవా ముఖ్యమంత్రి, మాజీ రక్షణ శాఖ మంత్రి మనోహర్‌ పారికర్‌ తెలిపారు. పనాజీలో ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే అమెరికాలో వీటి వాడకం ఎప్పుడో మొదలైంది సైనికుల దుస్తుల్లో చిన్న బ్యాటరీని అమర్చి వాటిని వాడుతున్నారు.