జూనియర్ ఎన్టీఆర్ కొత్త సినిమా జై లవ కుశ మీద బోలెడంత హైప్ ఇప్పటికే ఏర్పడిపోయింది. హీరోగా తారక్ తన నట విశ్వరూపాన్ని తెరమీద ఎలా చూపించాడు అనేది క్లియర్ గా అర్ధం అయ్యేలా కట్ చేసిన ఈ ట్రైలర్ చూసాక నందమూరి ఫాన్స్ మాత్రమె కాకుండా ఇతర హీరోల అభిమానులు కూడా ఈ సినిమా ఫస్ట్ డే చూడాల్సిందే అంటున్నారు.

అయితే తారక్ నటన కి తెలుగునాట మాత్రమే కాకుండా హిందీ వారి నుంచి కూడా ప్రసంసలు అందుతూ ఉన్నాయి. మూడు పాత్రల్లో ఎన్టీఆర్ కనపడిన తీరు అందరినీ వావ్ అనేలా చేస్తోంది.

జై గా తన ఉగ్రరూపం చూపించిన ఎన్టీఆర్ లవ గా సైలెంట్ బాయ్ గా కనిపిస్తాడు .. ఇక కుశ వేషం లో దొంగతనాలు చేస్తూ అందరి మనస్సులో కృష్ణుడు గా ఉంటూ ఉంటాడు. లవ కుశ ఇద్దరూ కలిసి తమ తమ రూపాలు మార్చుకుని బ్యాంకు లో ఏదో గమత్తు చెయ్యడానికి ప్రయత్నం చేసేలోపు తమ లాగే ఇంకొకడు ఉన్నాడు అని తెలుసుకుంటారు .

ఆ మూడో పాత్రే జై. బాలీవుడ్ విశ్లేష‌కుడు త‌ర‌ణ్ ఆద‌ర్శ్ త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేస్తూ ఎన్టీఆర్‌ను కొనియాడాడు. ఈ ట్రైల‌ర్ అద్భుతంగా ఉంద‌ని, జూనియ‌ర్ ఎన్టీఆర్ క‌ళ్లు, హావ‌భావాలతో పాటు ఆయ‌న‌లోని కామెడీ యాంగిల్ అద్భుత‌మ‌ని పేర్కొన్నాడు.