ఎంతటి టాప్ హీరో సినిమాకు అయినా అభిమానుల సపోర్ట్ లేకుండా అత్యంత భారీ ఓపెనింగ్స్ రావు. ఆతరువాత మాత్రమే సినిమా బాగుంది అన్న టాక్ వస్తే సాధారణ ప్రేక్షకులు టాప్ హీరోల సినిమాలను చూడటానికి వస్తారు. లేదంటే రెండు నెలలు ఆగితే చాలు బుల్లితెర పై వస్తుంది కదా అని సరిపెట్టుకుంటారు.

అందుకునే టాప్ హీరోలు అంతా అభిమానులే తమకు దేవుళ్ళు అంటూ వారిని ఆకాశంలోకి ఎత్తేస్తూ పొగడ్తల వర్షం కురిపిస్తూ ఉంటారు. ఇది అందరి టాప్ హీరోలకు సంబంధించిన విషయమే అందుకోసమే హీరోలు తమ అభిమానులు హద్దులు మీరినా భరిస్తూ ఉంటారు. అయితే దీనికి భిన్నంగా ఈమధ్య బాలకృష్ణ తన అభిమానులతో రెండు మూడు సందర్భాలలో అసహనాన్ని వ్యక్తపరిచిన విషయాలు తెలిసినవే.

దీనిప్రభావం ‘పైసా వసూల్’ కలక్షన్స్ పై చూపెట్టింది అని కొందరంటారు. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకునే కాబోలు కొద్ది రోజుల క్రితం జరిగిన ‘జై లవ కుశ’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో జూనియర్ తన అభిమానులతో చాల సహనంగా వ్యవహరించడమే కాకుండా ఫంక్షన్ అయిపోయాక అభిమానులు తీసుకు వచ్చిన దండలు బొకేలు వరసపెట్టి తీసుకోవడమే కాకుండా కొందరు వీరాభిమానులకు హగ్గులు కూడ ఇవ్వడం అందరి దృష్టిని ఆకర్షించింది.

దీనితో ఎన్టీఆర్ హగ్గులు ముద్దులు వెనుక బాలయ్య కొట్టిన దెబ్బల ప్రభావం ఉందని ఇండస్ట్రీలో గాసిప్పులు హడావిడి చేస్తున్నాయి. ఈ జన్మకు ఫ్యాన్స్ తోనే ఉంటా అంటూ బహిరంగంగా జూనియర్ ప్రకటించడం వెనుక తన అభిమానులను బుట్టలో వేసుకోవడానికే అన్న మాటలు కూడ వినిపిస్తున్నాయి.

ఈమధ్య కాలంలో విడుదలైన టాప్ హీరోల సినిమాలు అన్నీ డివైడ్ టాక్ తో సతమతమైన నేపధ్యంలో అటువంటి సమస్య ‘జై లవ కుశ’ కు రాకూడదు అంటే జూనియర్ అభిమానులు అంతా సైనికులు లా ఈసినిమా ఘన విజయానికి పనిచేయవలసి ఉంటుంది అన్న కామెంట్స్ కూడ వినిపిస్తున్నాయి..