సామ్‌, చైకి వూహించని సర్‌ప్రైజ్‌!

అక్టోబర్‌ 6న సమంత, నాగచైతన్య వివాహ బంధంతో ఒకటయ్యారు. గోవాలో వీరిద్దరి వివాహం కుటుంబీకులు, స్నేహితులు, సన్నిహితుల సమక్షంలో ఘనంగా జరిగింది. అయితే పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌, దర్శకుడు త్రివిక్రమ్‌ ఈ కొత్త జంటకి రెండు డైమండ్‌ ఉంగరాలను కానుకగా పంపినట్లు టాలీవుడ్‌ వర్గాల సమాచారం.

సరిగ్గా పెళ్లి సమయానికి బహుమతి అందేలా ప్లాన్‌ చేసి ప్రత్యేకంగా ఉంగరాలు డిజైన్‌ చేయించినట్లు తెలుస్తోంది. వీరిద్దరి గిఫ్ట్‌ చూసి సామ్‌, చై ఎంతో సర్‌ప్రైజ్‌ అయ్యారట. హైదరాబాద్‌లో ఏర్పాటుచేయనున్న రిసెప్షన్‌లో ఆ కానుకను ఇవ్వాలనుకున్నారు కానీ పెళ్లి రోజున ఇస్తే మరింత ప్రత్యేకంగా ఉంటుందని భావించారట.

అయితే అందులో ఏమాత్రం నిజం లేదని మరికొందరి వాదన. పవన్‌ కానీ త్రివిక్రమ్‌ కానీ వారిద్దరికీ ఎలాంటి కానుకలు పంపలేదని ఇతర వర్గాలు అంటున్నాయి. సమంత.. పవన్‌-త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో వచ్చిన ‘అత్తారింటికి దారేది’ చిత్రంలో నటించారు. ప్రస్తుతం పవన్‌ మరోసారి త్రివిక్రమ్‌ దర్శకత్వంలో వస్తున్న ఓ చిత్రంలో నటిస్తున్నారు.