‘రంగస్థలం 1985’ అంటూ రెడీ అవుతున్నాడు రామ్ చరణ్. అయితే ఈ మెగా హీరో చేస్తున్న సినిమాపై ఎన్నిసార్లు ఎన్ని రూమర్లు వచ్చినా కూడా.. టీమ్ అంతా వాటిని తిప్పికొడుతూనే ఉంది. కాకపోతే రిలీజ్ డేట్ ను ఎలా ఎడ్జస్ట్ చేస్తాడనేది మాత్రం ఇంకా క్లారిటీ లేదు. దానికి ఒక కారణం కూడా ఉంది.

క్రియేటివ్ డైరక్టర్ సుకుమార్ రూపొందిస్తున్న ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఈ సినిమాను సంక్రాంతి 2018 నాటికి రిలీజ్ చేయాలని ఫిక్స్ చేశారు. కాని ఒక తేదీ అనేదే మాత్రం ఇంకా డిక్లేర్ చేయలేదు. అయితే సడన్ గా పవన్ కళ్యాణ్ తన 25వ సినిమాను జనవరి 10న రిలీజ్ చేస్తున్నట్లు.. మొన్ననే ఒక సాంగ్ టీజర్ ద్వారా ప్రకటించేశారు. ఈ సందర్భంగా చరణ్ ఏమన్నా డేట్ మార్చుకుంటాడా? అనే క్వశ్చన్ ఉత్పన్నమైంది. ఎందుకంటే మరో ప్రక్కన మహేష్ బాబు కూడా సంక్రాంతికే ‘భరత్ అను నేను’ అనే సినిమాను తెస్తున్నాను అంటున్నాడు. సో చరణ్ ఎటువంటి కాల్ తీసుకుంటాడు?

నిజానికి చరణ్ అండ్ మహేష్ ఎప్పుడూ మాంచి అండర్ స్టాండింగ్ తోనే సినిమాలను రిలీజ్ చేస్తున్నారు. సో ఇప్పుడు కూడా ఖచ్చితంగా అలాంటి డీల్ ఒకటి చేసుకుంటారనే అనుకోవచ్చు. ఇక పవన్ కళ్యాణ్ సినిమాను తీస్తున్న నిర్మాతలు కూడా.. రంగస్థలం అండ్ భరత్ అను నేను సినిమాల టీమ్ లతో మాట్లాడాకే ఈ జనవరి 10 అనే డేట్ ను ఫిక్స్ చేశారని అంటున్నారు సన్నిహితులు. ఈ సందర్భంగా బాబాయ్ అండ్ మహేష్ కు ఆ తేదీలను వదిలేసి చరణ్ కాస్త ముందొస్తాడా? లేక లేటుగా వస్తాడా? చూద్దాం ఎలా డిసైడ్ చేస్తాడో!!