పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ ల లేటెస్ట్ మూవీ టైటిల్ కూడ ప్రకటించకపోయినా ఈసినిమాకు జరుగుతున్న బిజినెస్ ను చూసి టాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాలు షాక్ అవుతున్నాయి. ‘జల్సా’ ‘అత్తారింటికి దారేది’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్లు ఇచ్చిన త్రివిక్రమ్ సమర్ధత పై ఉన్న నమ్మకంతో ఈసినిమాకు ఎవరు ఊహించని ఫాన్సీ రేట్స్ ఆఫర్ చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

ఈసినిమా రైట్స్ దక్కించుకోవడానికి డిస్ట్రిబ్యూటర్ల మధ్య జరుగుతున్న పోటీని చూసి ఇండస్ట్రీ వర్గాల మైండ్ బ్లాంక్ అవుతోంది. ప్రస్తుతం తెలుగు సినిమా రంగంలో తిరుగులేని డిస్ట్రిబ్యూటర్‌ గా నిర్మాతగా అగ్రస్థానంలో కొనసాగుతున్న దిల్ రాజు ఈచిత్రం నైజాం రైట్స్ ను 29 కోట్లకు కొన్నట్లుగా జరుగుతున్న ప్రచారం ఎవరికీ నమ్మలేని విషయంగా మారింది.

నైజాం ఏరియాలో ‘బాహుబలి’ తరువాత ఈస్థాయి రేటు పలికి సినిమా ఇదేనని పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ కాంబినేషన్ కాబట్టి మోజుతో దిల్ రాజ్ ఇంతటి సాహసం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం విదేశాల్లో షూటింగ్ జరుపుకుంటున్న ఈమూవీ బుల్లితెర ప్రసారహక్కులను జెమినీ టీవీ 19.5 కోట్లకు కొనుగోలు చేసినట్లుగా ఇప్పటికే వార్తలు ఉన్నాయి.

ఈ సినిమా శాటిలైట్ హక్కులకు వచ్చిన డబ్బుతో ఒక మీడియం రేంజ్ తెలుగు సినిమా తీయవచ్చని కొందరు కామెంట్స్ కూడ చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా ఈ చిత్రానికి జరుగుతున్న ప్రీ రిలీజ్ బిజినెస్ 12o కోట్లు దాటుతుంది అని అంటున్నారు.

దీనితో ఇంత భారీ స్థాయిలో బిజినెస్ జరిగిన ఈమూవీ బయ్యర్లు నష్టాలు లేకుండా ఈసినిమా నుంచి బయటకు రావాలి అంటే కనీసం ఈ సినిమాకు 150 కోట్లకు తక్కువ
కాకుండా కలెక్షన్స్ రావాలని విశ్లేషకులు లెక్కలు కడుతున్నారు. ఇంతటి భారీ విజయం ఈ సినిమా అందుకోవాలి అంటే తిరుగులేని బ్లాకు బస్టర్ హిట్ గా ఈ సినిమా మారి తీరాలి అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి..