గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో కత్తి మహేష్ వర్సెస్ పవన్ ఫ్యాన్స్ రగడ ఏ రేంజ్ లో కొనసాగుతుందో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. పవన్ సినీరంగం, రాజకీయ రంగంపై తనదైన స్టైల్లో విమర్శలు చేసిన కత్తి మహేష్ పై పవన్ ఫ్యాన్స్ బండ బూతులు తిడుతూ..మెసేజ్ లు పెడుతూ.. ఫోన్స్ కాల్స్ చేసి నానా హంగామా చేశారు. దీనిపై కత్తి మహేష్ వివిధ చానెల్స్ లో తన గోడు విన్నవించుకున్నారు. ఇండస్ట్రీలో మూవీ క్రిటిగ్ గా పలు సినిమాల పై విశ్లేషణ అందించే కత్తి మహేష్ అంటే ఎవరికీ పెద్దగా తెలియకపోయినా..ఎప్పుడైతే బిగ్ బాస్ షోలో ఎంట్రీ ఇచ్చాడో అప్పటి నుంచి ఆయన సెలబ్రెటీగా మారారు.

ఇక పవన్ కళ్యాన్ విషయంలో జోక్యం చేసుకోవడంతో సోషల్ మీడియాలో మరింత పాపులర్ అయ్యాడు. పవన్ కళ్యాన్ గురించి త్తి మహేశ్ చేసిన వ్యాఖ్యల పట్ల పవన్ అభిమానులే కాదు ఇండస్ట్రీలో ఆయనను ఎంతగానో అభిమానించే నటులు కూడా రియాక్ట్ అవుతున్నారు. తాజాగా హృదయ కాలేయం చిత్రంతో బర్నింగ్ స్టార్ గా ఎంట్రీ ఇచ్చిన సంపూర్ణేష్ బాబు వాక్ స్వాతంత్య్రం ఎవరికైనా ఉంటుంది .. కానీ ఎవరి గురించి మాట్లాడుతున్నామో .. ఏం మాట్లాడుతున్నామో తెలుసుకుని మాట్లాడాలని కాస్త గట్టిగానే స్పందించారు.

వ్యక్తులపై ఎవరికైనా అభిప్రాయం చెప్పే హక్కు ఉంటుంది..కానీ ఆ వ్యక్తి పట్ల సమాజంలో ఉన్న గౌరవాన్ని కూడా చూసి ఆచీ తూచీ.. మాట్లాడితే ఎవరికైనా మంచిదని అన్నారు. పవన్ కల్యాణ్ మంచి నటుడు కాకపోతే .. ఇన్ని కోట్ల మంది మనసులను గెలవడం ఎలా సాధ్యమని అడిగాడు. పవన్ విషయంలో మహేశ్ కత్తి అలా మాట్లాడి ఉండకూడదనీ, ఆయన ధోరణి తనకి చాలా బాధ కలిగించిందని చెప్పుకొచ్చాడు.