పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ అంటే సినీ ప్రేక్షకుల్లో ఓ అలజడి.. ఆయన సినిమాలంటే ఓ సంచలనం. ఇలాంటి పెద్ద హీరోతో మంచి డైరెక్టర్‌ తోడయ్యాడంటే ఇక తిరుగుందా..? అలాంటి తిరుగులేని కాంబినేషనే పవన్‌కళ్యాణ్-త్రివిక్రమ్. వీరిద్దరి కాంబోలో ఇప్పటికే వచ్చిన ‘జల్సా’, ‘అత్తారింటికి దారేది’ సినిమాలు బ్లాక్‌బస్టర్ కొట్టేశాయి. ఆ తర్వాత ప్రస్తుతం మరోసారి ఈ క్రేజీ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతోంది. పవన్‌కళ్యాణ్ 25వ సినిమాగా వస్తున్న ఈ చిత్రంలో పవన్ సరసన కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

కాగా పవన్- త్రివిక్రమ్ ఈ అప్‌కమింగ్ మూవీపై అంచనాలు కూడా ఓ రేంజ్‌లో ఉన్నాయి. అందుకు తగ్గట్టుగా సినిమా థియేట్రికల్ రైట్స్ భారీదరకు అమ్ముడయ్యాయి. యూఎస్‌ఏ మరియు నైజాం థియేట్రికల్ రైట్స్ కలిపి ఏకంగా 50కోట్ల రూపాయలకు అమ్ముడు పోయినట్లుగా సినీ విశ్లేషకుడు రమేష్ బాలా ట్విట్టర్ ద్వారా తెలిపాడు. ‘బాహుబలి 2’ సినిమా తర్వాత అత్యధిక ధర పలికిన సినిమా ఇదేనని కూడా వెల్లడించాడు.