pawanklayn-firsrt-look

జ‌ల్సా, అత్తారింటికి దారేది చిత్రాల త‌ర్వాత పవ‌న్ క‌ళ్యాణ్‌- త్రివిక్ర‌మ్ కాంబోలో ఓ మూవీ రూపొందుతుంది. ప‌వ‌న్ 25వ చిత్రంగా రూపొందుతున్న ఈ మూవీకి ఇంజ‌నీర్ బాబు, రాజు వ‌చ్చినాడో అనే టైటిల్స్ ని ప‌రిశీలిస్తున్న‌ట్టు తెలుస్తుంది. ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయేల్ క‌థ‌నాయిక‌లుగా న‌టిస్తున్నారు. తమిళ సంగీత దర్శకుడు అనిరుద్ రవి చంద్రన్ సంగీతం అందిస్తున్నాడు.

కొద్ది రోజులుగా ఈ మూవీ ఫ‌స్ట్ లుక్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. స్వాతంత్య్ర దినోత్స‌వం సంద‌ర్భంగా విడుద‌ల చేస్తార‌ని అభిమానులు భావించిన‌ప్ప‌టికి వారికి నిరాశే ఎదురైంది. ఇక ప‌వ‌న్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా సెప్టెంబర్ 2న త‌ప్ప‌ని స‌రిగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్టిల్ ఒక‌టి విడుద‌ల కానుంద‌నే హోప్స్ తో ఫ్యాన్స్ ఉన్నారు. ఈ లోపులో ప‌వ‌న్ క‌ళ్యాణ్ 25వ సినిమాకి సంబంధించిన లుక్ అంటూ ఓ ఫోటో నెట్ లో వైరల్ గా మారింది.

ఇందులో ప‌వ‌న్ న‌ల్ల‌టి బ‌ట్ట‌లు ధ‌రించి మెడ‌లో శాల్ తో కాస్త కొత్త‌గా క‌నిపిస్తున్నాడు. మ‌రి ఇది ప‌వ‌న్ క‌ళ్యాణ్ 25వ చిత్రానికి సంబంధించిన‌దేనా లేదంటే గ‌తంలో ఎప్పుడో దిగిన ఫోటో ని తీసుకొచ్చి ఇప్పుడు ట్రెండ్ చేస్తున్నారా అనే అనుమానాలు ఫ్యాన్స్ లో కలుగుతున్నాయి. దీనిపై క్లారిటీ రావాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. ఇకపోతే ప‌వన్ బ‌ర్త్ డే త‌ర్వాత చిత్ర‌యూనిట్ మొత్తం యూర‌ప్ టూర్ చెక్కేయ‌నన్న సంగ‌తి తెలిసిందే.