పవన్ సినిమాకు 6 టైటిల్స్.. ఫైనల్ టైటిల్ అదే..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాటల మాంత్రికుడు త్రివిక్రం శ్రీనివాస్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. నంవంబర్ కల్లా సినిమాను పూర్తి చేసి డిసెంబర్లో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరిపి సంక్రాంతికి సినిమా రిలీజ్ చేయాలని చూస్తున్నారు. ఆల్రెడీ జనవరి 10న సినిమా రిలీజ్ అంటూ ఎనౌన్స్ చేశారు.

హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంలో కె.రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయెల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. కోలీవుడ్ యువ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచంద్రన్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నాడు. సినిమా లో పవన్ కళ్యాణ్ స్టూడెంట్ గా కనిపిస్తాడని టాక్. ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ దీవాళికి రిలీజ్ చేస్తారని తెలుస్తుంది.

ఈలోగా పవన్ త్రివిక్రం సినిమా టైటిల్స్ గా 6 టైటిల్స్ ప్రచారంలో ఉన్నాయి. ప్రస్తుతం అజ్ఞాతవాసి అంటూ టైటిల్ వినిపిస్తున్నా అది కాకుండా దేవుడే దిగి వచ్చినా, పరదేశ ప్రయాణం, మాధవుడు, గోకుల కృష్ణుడు, ఇంజినీర్ బాబు లాంటి టైటిల్స్ కూడా ప్రచారంలో ఉన్నాయి. మరి ఈ సినిమా టైటిల్ గా ఫైనల్ ఏది అవుతుంది అన్నది తెలియాల్సి ఉంది.

జల్సా, అత్తారింటికి దారేది సినిమాల తర్వాత పవన్ త్రివిక్రం కలిసి చేస్తున్న ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. సర్దార్ గబ్బర్ సింగ్, కాటమరాయుడు సినిమాతో నిరాశ పడిన పవర్ స్టార్ ఫ్యాన్స్ ఈ సినిమాతో పండుగ చేసుకోవడం ఖాయమని అంటున్నారు.