అత్తారింటికి దారేది , జల్సా లాంటి బ్లాక్ బస్టర్ లు ఇచ్చిన త్రివిక్రమ్ – పవన్ కళ్యాణ్ మళ్ళీ కలిసి ఒక సినిమా చేస్తున్నారు అని ప్రకటించగానే ఫాన్స్ తో పాటు డిస్ట్రిబ్యూటర్ లు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు.

త్రివిక్రమ్ – పవన్ కాంబినేషన్ అంటే జనాలు ఎగబడతారు కాబట్టి ఆ సినిమా కొనుక్కోవాలని చాలామంది ప్లాన్ లు వేస్తున్నారు. అయితే ఇంకా లోగో లాంటిది విడుదల కాలేదు కానీ ఈ సినిమా షూటింగ్ మాత్రం త్రివిక్రమ్ ఫాస్ట్ ఫాస్ట్ గా చేస్తున్నాడు.

కీర్తి సురేష్ – పవన్ కళ్యాణ్ ఫస్ట్ టైం రోమాన్స్ చెయ్యబోతున్న ఈ సినిమాలో ఈ మధ్యనే వాళ్ళిద్దరి మధ్యనా కొన్ని సీన్ లు షూట్ చేసారు. ఈ షూటింగ్ అవ్వగానే టీం మొత్తం యూరప్ వెళుతుంది.

త్రివిక్రమ్ – పవన్ కాంబినేషన్ లో గత చిత్రం ఐన అత్తారింటికి దారేది లో మేనత్త మేనల్లుడి సెంటిమెంట్ మీద సినిమా అంతా నడిచినట్టే ఇప్పుడు ఈ కొత్త సినిమా మొత్తం కూడా తండ్రీ కొడుకుల సెంటిమెంట్ మీద ఉంటుంది అంటున్నారు. సెంటిమెంట్ తో పాటు యాక్షన్ సీన్స్ కూడా ఎక్కువగానే ఉంటాయని అంటున్నారు. అనూ ఇమ్మాన్యుయేల్ మరో కథానాయికగా నటిస్తోన్న సంగతి తెలిసిందే.