రీసెంట్‌గా విడుదలైన జైలవకుశ మూవీ సక్సెస్‌తో ఫుల్‌జోష్‌మీదున్నాడు టాలీవుడ్ హీరో ఎన్టీఆర్. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ కాంబినేషన్‌లో సినిమా చేసేందుకు ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

సిల్వర్‌స్క్రీన్‌పై రానున్న ఈ క్రేజీ ప్రాజెక్టుకు సంబంధించి ఇంట్రస్టింగ్ న్యూస్ ఫిలింనగర్‌లో చక్కర్లు కొడుతున్నది. ఈ మూవీలో ఎన్టీఆర్ మిలటరీ ఆఫీసర్‌గా కనిపించనున్నాడట. అయితే ఇది దేశభక్తి నేపథ్యంలో తెరకెక్కే చిత్రం కాదని తెలుస్తోంది.

త్రివిక్రమ్-ఎన్టీఆర్ కాంబో మూవీని తమిళంలో కూడా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తోందట చిత్రయూనిట్. ఇప్పటివరకు పోలీస్‌ఆఫీసర్‌గా తెరపై కనిపించిన తారక్, త్రివిక్రమ్ సినిమాలో మిలటరీ అధికారిగా కనిపించి ఫ్యాన్స్‌కు కనువిందు చేయనున్నాడు. డైరెక్టర్ త్రివిక్రమ్ మజ్ను ఫేం అను అమ్మాన్యుయేల్‌ను హీరోయిన్‌గా ఫైనల్ చేసినట్లు సమాచారం. ఇక ఈ ప్రాజెక్టు త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది.