ఎన్టీఆర్ క్రేజ్ @ ఎన్ని కోట్లో తెలుసా…

ఎన్టీఆర్ క్రేజ్‌కు ఎవ‌రైనా లెక్క‌క‌ట్ట‌డే ద‌మ్ముందా..! ఎవ్వ‌రూ లెక్క‌క‌ట్ట‌లేని అమూల్య‌మైన క్రేజ్‌, ఫ్యాన్స్ నాటి సీనియ‌ర్ ఎన్టీఆర్‌తో పాటు నేటి జూనియ‌ర్ ఎన్టీఆర్ సొంతం. తాత సీనియ‌ర్ ఎన్టీఆర్ పోలిక‌లు ఉండ‌డంతో ఆ నంద‌మూరి తార‌క రాముడికి ఫ్యాన్స్‌తో పాటు క్రేజ్ కూడా చాలా వ‌ర‌కు జూనియ‌ర్ ఓన్ చేసుకున్నాడు. ఇదంతా కాసేపు ప‌క్క‌న పెట్టేస్తే ఎన్టీఆర్ లేటెస్ట్ మూవీ జై ల‌వ‌కుశ ద‌స‌రాకు థియేట‌ర్ల‌లోకి వ‌చ్చింది.

కంటెంట్ ప‌రంగా చూస్తే జై ల‌వ‌కుశ అంత గొప్ప సినిమా కాదు. ద‌ర్శ‌కుడు ఓ యావ‌రేజ్, ఓ డిజాస్ట‌ర్ తీశాడు. హీరోయిన్లు తెలుగు ఆడియెన్స్‌లో చాలామందికి తెలియ‌ని వాళ్లే. ఆడియో కూడా అంత హిట్ అవ్వ‌లేదు. సినిమాలో కామెడీ కూడా లేదు. బ‌డ్జెట్ త‌క్కువే… మ‌రి ఇలాంటి సినిమా మ‌రో హీరో తీస్తే ఖ‌చ్చితంగా మొద‌టి రోజే ఫ‌ట్‌మ‌నేది.

కానీ జై ల‌వ‌కుశ ఇప్ప‌టికే వ‌ర‌ల్డ్ వైడ్‌గా కాస్త అటూ ఇటూగా రూ.135 కోట్ల గ్రాస్‌కు చేరువైంది. షేర్ రూ.80 కోట్లు దాటేసింది. మ‌రి సినిమాలో ఏమీ లేదు… మంచి టాక్ రాలేదు… ఇన్ని కోట్లు ఎలా వ‌చ్చాయా అంటే అందుకు ఆన్స‌ర్ ఒక్క‌టే పేరు.. అదే ఎన్టీఆర్‌. ఎన్టీఆర్ ట్రిబుల్ రోల్ క‌న్నా కూడా ఒక్క జై క్యారెక్ట‌రే సినిమాను హిట్ చేసేసింది.

బిలో యావ‌రేజ్ కంటెంట్ సినిమాతో ఈ స్థాయి వసూళ్లు రాబట్టడం అంటే చిన్న విషయం కాదు. కేవ‌లం ఎన్టీఆర్ స‌త్తా, ఇమేజ్‌, క్రేజ్ వ‌ల్లే అది సాధ్య‌మైంది. దీనిని బ‌ట్టి మ‌న తార‌క్ క్రేజ్ ఏ రేంజ్‌లో ఉందో అర్థ‌మ‌వుతోంది.