Ntr-Balakrishna

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ నందమూరి బాలకృష్ణ ఇద్దరు ఒకే ఫ్యామిలీకి చెందిన హీరోలు. ఎవరికి వారు సొంత ఇమేజ్ తెచ్చుకున్న ఈ స్టార్ హీరోలు బాక్సాఫీస్ దగ్గర బిగ్ ఫైట్ కు సిద్ధమవుతున్నారు. బాలయ్య బాబుతో వ్యక్తిగతంగా ఎలా ఉన్నా సినిమాలతో పోటీ తప్పదంటున్నాడు తారక్. ఆల్రెడీ లాస్ట్ ఇయర్ సంక్రాంతికి ఇద్దరి మధ్య పోటీ జరిగింది.

ఆ రేసులో బాలయ్య వెనుక పడగా తారక్ హిట్ అందుకున్నాడు. ఇక ఇప్పుడు కూడా సెప్టెంబర్ 29న తన సినిమా రిలీజ్ అని చెప్పిన బాలయ్యకు మళ్లీ షాక్ ఇచ్చాడు జూనియర్ ఎన్.టి.ఆర్. ప్రస్తుతం బాబి డైరక్షన్ లో ఎన్.టి.ఆర్ చేస్తున్న జై లవకుశ సినిమా సెప్టెంబర్ 21న రిలీజ్ ఫిక్స్ చేశారు. అంటే వారం తేడాతో మళ్లీ నందమూరి హీరోల బాక్సాఫీస్ యుద్ధం షురూ అవుతుందన్నమాట.

బాలయ్య వస్తున్నాడని తెలిసినా సరే దసరా కాబట్టి తారక్ రాక తప్పట్లేదు. ఇక మరో పక్క ఇదే డేట్ కు రావాల్సిన సూపర్ స్టార్ మహేష్ మురుగదాస్ ల స్పైడర్ మళ్లీ పోస్ట్ పోన్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో మొత్తానికి బాలయ్యతో ఎన్.టి.ఆర్ మళ్లీ ఫైట్ కు సిద్ధమయ్యాడు.

పూరి డైరక్షన్ లో బాలయ్య పైసా వసూల్ గా వస్తుండగా సినిమాలో డాన్ పాత్రలో కనిపించబోతున్నాడు బాలకృష్ణ. ఇక బాబి డైరక్షన్ లో జై లవకుశ అంటున్న తారక్ సినిమాలో మూడు విభిన్న పాత్రల్లో నటిస్తున్నాడు. మరి వారంలో ఇద్దరు హీరోలలో నందమూరి ఫ్యాన్స్ ఎవరి సినిమా హిట్ చేస్తారో చూడాలి.