టాలీవుడ్ మోస్ట్ పాపులర్ ప్రేమ జంటగా పేరుపొందిన నాగచైతన్య సమంతల పెళ్ళి అక్టోబర్ 6న జరగబోతున్న నేపధ్యంలో ప్రస్తుతం అక్కినేని కుటుంబ సభ్యులు అంతా చాల బిజీగా ఉన్న విషయం తెలిసిందే. గోవాలో జరగబోతున్న వీరిద్దరి పెళ్ళికి కేవలం 175 అతిధులను మాత్రమే పిలవడానికి నాగార్జున చైతన్యలు ఫిక్స్ అయినట్లు సమాచారం.

దీనితో టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖులలో అతి కొద్ది మందికి మాత్రమే నాగార్జున చైతన్యలు స్వయంగా ఆహ్వానిస్తారని తెలుస్తోంది. గోవాలో హిందూ క్రిష్టియన్ సంప్రదాయాల పద్ధతుల్లో రెండు సార్లు జరిగే ఈపెళ్ళికి 5వ తారీఖు నుండి 8వ తారీఖు వరకు గోవాలో ఉండేవిధంగా రమ్మని అతిధులను పిలుస్తున్నట్లు టాక్.

తెలుస్తున్న సమాచారం మేరకు నాగార్జున సమంత కుటుంబ సభ్యులతో పాటు చైతన్య తనకు బాగా సన్నిహితంగా ఉండే జూనియర్ ఎన్టీఆర్ ను అదేవిధంగా చైతన్యతో తరుచు లాంగ్ డ్రైవింగ్ లకు వెళ్ళే అల్లు శిరీష్ నితిన్ లను చైతు వ్యక్తిగతంగా పిలుస్తున్నట్లు తెలుస్తోంది. ఇక నాగార్జున తరఫున అతడి సన్నిహితులుగా పేరు గాంచిన చిరంజీవి అల్లు అరవింద్ నిమ్మగడ్డ ప్రసాద్ లు ఈలిస్టులో ప్రధమ స్థానంలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనికితోడు చరణ్ ఉపాసనలు కూడ ఈపెళ్ళికి వ్యక్తిగతంగా హాజరు అయ్యే అవకాశం ఉంది అనిఅంటున్నారు.

ఇక సమంతకు సంబంధించి ఆమె కుటుంబ సభ్యులతో పాటు ఆమె పర్సనల్ స్టైలిస్ట్ కోన నీరజను కూడ పిలుస్తున్నట్లు సమాచారం అయితే సమంతతో గతంలో నటించిన చాలామంది హీరోలు హీరోయిన్స్ కు ఈ పెళ్ళి పిలుపులో చోటు లేదని అంటున్నారు.

అయితే గోవా నుంచి తిరిగి వచ్చిన తరువాత అన్నపూర్ణ స్టూడియోస్ లో ఏర్పాటు చేసిన ఒక భారీ సెట్ లో వీరిద్దరి మ్యారేజ్ రిసెప్షన్ అత్యంత ఘనంగా ఏర్పాటు చేయడానికి నాగార్జున ముంబాయికి చెందిన ఒక ప్రముఖ ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థతో ఇప్పటికే చర్చలు జరుపుతున్నట్లు టాక్. దీనినిబట్టి చూస్తూ ఉంటే అక్టోబర్ 6వ తారీఖు నుండి సుమారు ఒక వారం రోజులపాటు మీడియా అంతటా సమంతా చైతన్యల పెళ్లి వార్తలతో ఫోటోలతో హడావిడితో నిండిపోయే ఆస్కారం కనిపిస్తోంది..