తెలుగు సినిమాలకు సంబంధించి అమెరికాలో 200 స్క్రీన్లలో రిలీజ్ అయితే చాల గొప్పగా చెప్పుకుంటారు. అయితే ‘బాహుబలి’ మినహాయిస్తే మరే తెలుగు సినిమా కూడా 250 స్క్రీన్లకు మించి విడుదలైన సందర్బాలు గతంలో లేవు. అయితే ఇప్పుడు మహేష్ ‘స్పైడర్’ అమెరికాలో ఏకంగా 400 స్క్రీన్స్ లో విడుదల అవుతూ మహేష్ మ్యానియాను సూచిస్తోంది.

ఈమూవీ ద్విభాషా చిత్రం కావడంతో కేవలం అమెరికాలో 400 ధియేటర్స్ లో ఈసినిమాను విడుదల చేయబోతున్నారు. దీనితో ‘బాహుబలి 2’ తరువాత అత్యధిక స్క్రీన్స్ దక్కించుకున్న మూవీగా ‘స్పైడర్’ రికార్డ్ క్రియేట్ చేస్తోంది. ఈసినిమా ప్రీమియర్ షోలు కూడ చాల భారీ స్థాయిలో ప్రదర్శిస్తూ ఉండటంతో ‘స్పైడర్’ కు కేవలం ప్రీమియర్ షోల ద్వారానే 2 మిలియన్లు డాలర్లు వచ్చి పడతాయి అని అంటారు.

అన్నీ అనుకున్నట్లుగా జరిగి ఈమూవీకి పాజిటివ్ టాక్ వస్తే 5 మిలియన్ డాలర్ల సినిమాగా ‘స్పైడర్’ మారిపోవడం ఖాయం అని అంటున్నారు. ‘స్పైడర్’ విడుదల అవుతున్న 400 లొకేషన్స్ లో సెప్టెంబరు 26నే ప్రిమియర్ షోలు వేస్తున్నారు. రెగ్యులర్ ప్రిమియర్లు వేసే సమయం కంటే ముందే ‘స్పైడర్’కు ప్రిమియర్లు పడతాయట.

అసలే ఎక్కువ లొకేషన్లు పైగా ఎక్కువ షోలు పడుతుండటంతో ‘స్పైడర్’ కలెక్షన్లు ఊహించని స్థాయిలో ఉంటాయని విశ్లేషకుల అంచనా. అమెరికాలో మహేష్ కు తిరుగులేని ఫాలోయింగ్ ఉన్న నేపధ్యంతో పాటు మురగదాస్ సినిమాల పై ఉన్న క్రేజ్ కూడ ‘స్పైడర్’ కు బాగా కలిసి వస్తోంది.

మన తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళ కన్నడ మలయాళ రాష్ట్రాలలో ‘స్పైడర్’ అత్యంత భారీ స్థాయి దియేటర్ల సంఖ్యలో విడుదల అవుతున్న నేపధ్యంలో దసరాకు వస్తున్న 4 రోజుల లాంగ్ వీకెండ్ ను ‘స్పైడర్’ టార్గెట్ చేస్తున్న నేపధ్యంలో ఈమూవీ టాక్ ఎలా ఉన్నా మొదటి 4 రోజులకు ఈమూవీకి 50 కోట్ల కలక్షన్స్ పైగా వసూళ్లు రావడం ఖాయం అన్న మాటలు వినిపిస్తున్నాయి..