ప్రస్తుతం నిర్మాతగా దిల్ రాజ్ అందుకుంటున్న విజయాలను చూసి టాలీవుడ్ ఇండస్ట్రీ షేక్ అవుతోంది. ఈ ఏడాది ‘శతమానం భవతి’ ద్వారా బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న దిల్ రాజు దర్శకుడు సతీష్ వేగేశ్న కాంభినేషన్ లో మరో సినిమాను తీయడానికి రెడీ అవుతున్నాడు. “శ్రీనివాస కళ్యాణం” టైటిల్ తో ఈ సినిమా నిర్మాణం జరగబోతున్నట్లు ఇప్పటికే ఈ విషయమై దిల్ రాజు ఒక అధికారిక ప్రకటన కూడ ఇచ్చాడు.

అయితే ఈ సినిమా హీరో విషయంలో క్లారిటీ లేక పోవడంతో ఈ సినిమాలో హీరోగా ఎవరు నటిస్తారు ? అనే విషయం పై రకరకాల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. అయితే ఫైనల్ గా జూనియర్ ఎన్టీఆర్ రూపంలో ‘శ్రీనివాసుడు’ వస్తున్నట్లు వార్తలు హడావిడి చేస్తున్నాయి. తెలుస్తున్న సమాచారం మేరకు ఈసినిమా కధను ఇటీవల దర్శకుడు సతీష్ వేగేశ్న మరియు దిల్ రాజులు కలిసి జూనియర్ ఎన్టీఆర్ కు వినిపించగా కధ విని వెంటనే జూనియర్ ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.

అయితే ఈ సినిమాలో తాను నటించే విషయం పక్కా అయినా తనకు కాస్త సమయం కావాలి అని తారక్ కోరినట్లు సమాచారం. ప్రస్తుతం ‘జై లవ కుశ’ సినిమాతో బిజీగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ తన తదుపరి చిత్రాన్ని త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేయనున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత దిల్ రాజు సతీష్ వేగేశ్నల “శ్రీనివాస కళ్యాణం” సినిమా ప్రారంభించే యోచనలో ఓకే చెప్పినట్లుగా సినీ వర్గాలలో ప్రచారం జరుగుతోంది

ఫిలిం నగర్ లో హడావిడి చేస్తున్న వార్తల ప్రకారం ఈ మూవీ కధ గతంలో జూనియర్ నటించిన ‘బృందావనం’ మూవీ ఛాయలతో ఉంటుంది అని టాక్. తారక్ ను ఫ్యామిలీ ఆడియన్స్ కు మరింత చేరువ చేసే ప్రయోగంగా ఈ ‘శ్రీనివాస కళ్యాణం’ ప్రయోగం అని అంటున్నారు. తను నటించే ప్రతి సినిమా పాత్రలోను వైవిధ్యం ప్రదర్శిస్తూ జూనియర్ పరుగులు తీస్తున్న వైనం టాప్ హీరోలను ఖంగారు పెడుతోంది అని అంటున్నారు..