జై లవ కుశ సినిమా కోసం ఫాన్స్ తో పాటు ఇతర సినిమా అభిమానులు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. హీరోగా జూనియర్ ఎన్టీఆర్ తనదైన శైలి లో ఎలా రెచ్చిపోయాడు అనేది ట్రైలర్ చూస్తేనే అర్ధం అవుతోంది. జై ,లవ ,కుశ గా మూడు పాత్రలలో ఎన్టీఆర్ తన నట విశ్వరూపం చూపించబోతున్నాడు అని ట్రైలర్ చెబుతోంది.

రావణా అంటూ కనిపిస్తున్న ఒక పాత్ర న భూతో న భవిష్యత్త్ గా ఉంది. జై పాత్రలోని రాక్షసత్వం తో చాలామంది తేలికగా కనక్ట్ అయ్యారు .. ఈ సినిమా ట్రైలర్ కి ఇప్పటికే సూపర్ రెస్పాన్స్ వస్తూ ఉండగా జై లవ కుశ క్లైమాక్స్ విషయం లో అనేక విషయాలు తెలుస్తున్నాయి.

ఈ సినిమా క్లైమాక్స్ ని మొదట డైరెక్టర్ బాబీ ఒకరకంగా రాసుకున్నారట , కానీ ఆఖర్లో కాస్తంత కామెడీ లేకపోతే కష్టం అని కోనా వెంకట్ , ఎన్టీఆర్ గట్టిగా పట్టు బట్టడం తో బాబీ క్లైమాక్స్ ని డిఫరెంట్ గా ప్లాన్ చేసాడు అంటున్నారు.

ఎన్టీఆర్ జోడీ కట్టిన రాశి ఖన్నా .. నివేదా థామస్ ఇద్దరూ కూడా, ఈ సినిమా తమ కెరియర్ కి ఎంతో హెల్ప్ అవుతుందని భావిస్తున్నారు. ఇక ఎన్టీఆర్ కి హ్యాట్రిక్ హిట్ పడటం ఖాయమనేది ఆయన అభిమానుల మాట. అయితే కోనా వెంకట్ ప్రస్తుతం ఫార్మ్ పూర్తిగా కోల్పోయాడు ఇలాంటి టైం లో ఆయన చెయ్యి పెడితే తమ హీరో సినిమా పరిస్థితి ఎలా అయిపోతుందా అని ఫాన్స్ భయపడుతున్నారు.