జై లవ కుశ సినిమాలో హీరో జూనియర్ ఎన్టీఆర్ మూడు పాత్రలలో కనిపించబోతున్నాడు. జై విలన్ గా మిగితా పాత్రలు లవ సైలెంట్ బాయ్ గా , కుశ ఎంటర్టైనర్ గా ఉండబోతోంది అని ట్రైలర్ చూస్తే అనిపిస్తుంది.

ఈ విషయమే మొదటి నుంచీ ప్రచారం లో కూడా ఉంది. అయితే కావాలనే ఈ సినీమా బృందం జై ని అలా చూపించే ప్రయత్నం చేస్తోంది అని విశ్వసనీయ సమాచారం.సినిమా మీద హైప్ పెంచడం కోసమే ఇలా చేస్తున్నారు అనీ ఎన్టీఆర్ ని రావణాసురుడు టైపు లో చూపించే ప్రయత్నం చేస్తున్నారు అనీ నిజానికి జై లో మూడు పాత్రలూ కామెడీ పండించేవి గా చెబుతున్నారు .

నాటకాలు అంటే పిచ్చి ఉండే జై రావణాసురుడు పాత్ర కి లోకల్ గా వేసే నాటకాలలో సుప్రసిద్ధ నటుడు. అనుకోని సంఘటన లతో నాటకాలు చేసుకునే వ్యక్తి కాస్తా రియల్ లైఫ్ లో రావణాసురుడు అవుతాడు. జై మొదటి నుంచీ విలన్ కాదు అనీ కొన్ని సంఘటనలు అతన్ని అలా మారుస్తాయి అని అంటున్నారు.