తెలుగు ఇండస్ట్రీలో హ్యాట్రిక్ విజయం సాధించి మంచి ఫామ్ లో ఉన్న హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో నందమూరి కళ్యాన్ నిర్మిస్తున్న చిత్రం ‘జై లవ కుశ’ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించి ట్రైలర్ ఈ మద్య రిలీజ్ అయ్యింది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ మూడు విభిన్నమైన పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.

ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 21న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. జై లవ కుశ ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ సోషల్ మీడియాలో దుమ్మురేపుతున్నాయి..ఇక ట్రైలర్ అయితే ఏకంగా రికార్డులు బ్రేక్ చేస్తూ వస్తుంది. ఎన్టీఆర్ జై లవకుశ సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకుంది. బాబీ దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మించిన ఈ చిత్రానికి యు /ఏ సర్టిఫికేట్ ఇచ్చారు.

ఇక ఎన్టీఆర్ నటించిన జై లవ కుశ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు పెరిగిపోయాయి..ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ రోజు నందమూరి కళ్యాన్ మాట్లాడిన మాటలతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ సినిమాపై మరిన్ని ఆశలు పెంచుకున్నారు. రాశి ఖన్నా , నివేదా థామస్ లు హీరోయిన్ లుగా నటిస్తున్న ఈ చిత్ర నిడివి రెండు గంటల ముప్పై అయిదు నిముషాలు ఉండబోతుందట.

ఎన్టీఆర్ మూడు పాత్రలు పోషించడం ఇక ఎత్తైతే.. అందులో జై క్యారెక్టర్ సినిమాలో దుమ్ము దులిపాడట. ఇక మిగతా రెండు పాత్రల విషయానికి వస్తే..సెంటిమెంట్, ఫుల్ కామెడీతో ఆధ్యంతం ఆసక్తి కరంగా కొనసాగుతుందట. ఈ సినిమా రిలీజ్ కోసం ఎన్టీఆర్, నందమూరి ఫ్యాన్స్ వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు.