తెలుగు ఇండస్ట్రీలో గత మూడు సంవత్సరాల నుంచి వరుస హిట్స్ తో హ్యాట్రిక్ విజయం సాధించిన యంగ్ హీరో ఎన్టీఆర్ తాజాగా బాబీ దర్శకత్వంలో కళ్యాన్ రామ్ నిర్మాణ సారథ్యంలో ‘జై లవ కుశ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ప్రపంచవ్యాప్తంగా సుమారు 2400 ల పైగా స్క్రీన్లలో తొలి ఆట పడనుంది. ‘బాహుబలి-2’ తర్వాత అత్యధిక స్క్రీన్లలో రిలీజవుతున్న సినిమా ఇదే కావడం విశేషం. ఎన్టీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేసిన సినిమా కావడంతో ప్రేక్షకుల్లో, అభిమానుల్లో ఈ చిత్రంపై ఎన్నో అంచనాలున్నాయి.

దీనికి తగ్గట్టు ఫస్ట్ లుక్స్, టీజర్లు, ట్రైలర్ కూడా సోషల్ మీడియాలో దుమ్మురేపుతూ వచ్చింది. అయితే జై లవ కుశ కొన్ని కేంద్రాల్లో ప్రీమియం షో జరిగింది. ఇక ప్రీమియం టాక్ షో ప్రకారం సినిమా ఆద్యంతం ఆసక్తి కరంగా ఉందని..ఫస్ట్ హాఫ్ కాస్త స్లో గా సాగినా లవ, కుశ పాత్రలు చేసిన సందడి పరవాలేదనిపించినా..ఇంట్రవెల్ బ్యాన్ లో జై పాత్ర ఎంట్రీ చాలా అద్భుతంగా ఉందని అంటున్నారు.

ఫస్ట్ ఆఫ్ ఎంత కామెడీగా సాగిందో సెకండ్ ఆఫ్ కామెడీ తో పాటు, ఎమోషన్స్, సెంటి మెంట్ తో సాగిందట. ఇక లవ, కుశ పాత్రలతో ఎన్టీఆర్ కాస్త ఫన్నీగా అనిపించినా.. జై పాత్రలో మాత్రం చాలా వైలెంట్ గా చూపించారట. ఇక జై పాత్రలో నత్తిగా మాట్లాడుతూ ఎన్టీఆర్ తన నట విశ్వరూపాన్ని చూపించారట. సినిమాలో అక్కడక్కడా ముగ్గురు ఒకే చోట కనిపించడం చూస్తుంటే అభిమానుల్లో ఆనందానికి అవధులు లేకుండా పోయాయట.

దర్శకుడు బాబీ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో రాశీ ఖన్నా, నివేతా లు హీరోయిన్లుగా నటించగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. మొత్తానికి సినిమా ప్రీమియం షో టాక్ మాత్రం చాలా వరకు పాజిటీవ్ గా వచ్చిందని నందమూరి, ఎన్టీఆర్ ఫ్యాన్స్ తెగ సంబరాల్లో తేలిపోతున్నారు.