జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ లో మునుపెన్నడు లేని విధంగా మొదటి సారి మూడు విభిన్న పాత్రలతో రాబోతున్న చిత్రం “జై లవకుశ”. ఫస్ట్ లుక్ తోనే అంచనాలను పెంచిన ఎన్టీఆర్ వరుసగా టీజర్స్ ను పాటలను ఒకదాని తార్వత ఒకటి వదిలి సినిమాపై అంచనాలు మరింత పెంచాడు. రీసెంట్ గా ట్రైలర్ లాంచ్ ని గ్రాండ్ గా నిర్వహించి ట్రైలర్ ని రిలీజ్ చేశాడు. అయితే రీసెంట్ గా మారో పాట యొక్క సాంగ్ ట్రైలర్ ని సోషల్ మీడియాలో రిలీజ్ చేసింది జై లవ కుశ చిత్ర యూనిట్.

దేవిశ్రీప్రసాద్ కంపోజ్ చేసిన ఈ సినిమాలో మెలోడీ సాంగ్ ” నీ కళ్ళలోన” అనే పాట ఆడియో పరంగానే కాకుండా వీడియో పరంగాను సూపర్బ్ గా ఉంది. నివేద థామస్ అందాలను ఆకాశం – వానతో పోలుస్తూ ఎన్టీఆర్ పాడుతూ .. స్టెప్పులు వేస్తూ ఉంటె చూడటానికి చాలా బావుంది. లొకేషన్స్ కూడా చాలా బావున్నాయి. ఇక నివేదా థామస్ అయితే చాలా అందంగా కనిపిస్తోంది. ఎన్టీఆర్ “జై” పాత్ర కోపంతోనే కాదు రొమాన్స్ తో కూడా గట్టిగానే అదరగొట్టినట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా తేలి పోయా అనే ట్యూన్ వచ్చినప్పుడు ఎన్టీఆర్ వేసిన స్టెప్పులు బాగున్నాయి. 44 సెకన్ల ట్రైలర్ లోనే ఇంత బావుందంటే ఇక మొత్తం పాట చూస్తే ఇంకెంత బావుంటుందో అని ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.

కె.ఎస్.రవీంద్ర డైరక్షన్లో రూపొందిన ‘జై లవ కుశ’ సినిమాను సెప్టెంబర్ 21న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే.