యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ నటించిన జై లవ కుశ ఈ నెల 21న రిలీజ్ కాబోతుంది. బాబి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాను ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ పతాకంలో కళ్యాణ్ రాం నిర్మించారు. ఈ సినిమాపై ఏర్పడ్డ భారీ అంచనాలను అందుకునేలా సినిమా ఉంటుందని చెబుతున్నా ఎక్కడో సినిమా మీద నెగటివ్ ప్రచారం కొనసాగుతూనే ఉంది.

ఇక సినిమా ఫస్ట్ కాపీ సిద్ధమైందట.. 155 నిమిషాల నిడివి గల జై లవ కుశ రేపు సెన్సార్ కు వెళ్లనుందట. తారక్ ఏకంగా మూడు డిఫరెంట్ పాత్రలో నటించిన ఈ సినిమాలో రాశి ఖన్నా, నివేథా థామస్ లు హీరోయిన్స్ గా నటించారు. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాలో రిలీజ్ అయిన నాలుగు సాంగ్స్ అదుర్స్ అంటున్నారు ఫ్యాన్స్.

ఇక సినిమాలో మరో స్పెషల్ సాంగ్ కూడా ఉంటుందని తెలిసిందే. తమన్నాతో వచ్చే ఆ ఐటం సాంగ్ రివీల్ చేయలేదు చిత్రయూనిట్. సినిమా ఎంతో కష్టపడి చేశామని ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పిన చిత్రయూనిట్ సినిమా ఫలితం గురించి కాకుండా ఎంతమేరకు జనాల్లోకి వెళ్తుంది అన్న విధంగా ఆలోచిస్తున్నారట. అందుకే ట్రైలర్ రిలీజ్ వేడుకలో అన్నదమ్ములందరికి ఈ సినిమా అంకితం అన్నాడు తారక్.

మరి అంచనాలను మించేలా సినిమా ఉంటుందా తారక్ నట విశ్వరూపం ఏ రేంజ్ లో ఉండబోతుంది అన్న ప్రశ్నలన్నిటికి సమాధానం తెలియాలంటే మరో 8 రోజులు వెయిట్ చేస్తే సరిపోతుంది. దసరాకి తన స్టామినా చూపించేందుకు వస్తున్న తారక్ జై లవ కుశతో ఎలాంటి సంచలన రికార్డులు అందుకుంటాడో చూడాలి.