Jai-lavakusa

గంభీరమైన స్వరంతో ఎటువంటి పాత్రను అయినా మెప్పించగల విలక్షణనటుడు సాయి కుమార్. ‘జై లవ కుశ’ లో ఒక కీలక పాత్ర చేసినా ఆయన పాత్రకు సంబంధించిన వివరాలు పెద్దగా బయటకు రాకపోవడానికి వెనుక కొన్ని కారణాలు ఉన్నాయి అని అంటున్నారు.

‘జై లవకుశ’ కు సంబంధించి టీజర్లలో అయినా ట్రైలర్లో అయినా పోస్టర్లలో అయినా ఎన్టీఆర్ హైలైట్ అవుతున్నాడు. ఈమూవీలో జూనియర్ మూడు పాత్రలు చేయడంతో స్క్రీన్ మొత్తం ఎన్టీఆర్ కనిపిస్తున్నాడు అన్న కామెంట్స్ వస్తున్నాయి. ట్రైలర్లో హీరోయిన్లు కూడా ఇలా మెరిసి అలా మాయమైపోతున్న నేపధ్యంలో ఈ సినిమాలోని విలన్ పాత్రలు సహాయపాత్రలు ఎవరు చేస్తున్నారన్న విషయమై ఎవరు పెద్దగా పట్టించుకోవడంలేదు.

అయితే ‘జై లవకుశ’ లో ఎన్టీఆర్ చేసిన మూడు పాత్రల తర్వాత సాయికుమార్‌ ది అత్యంత కీలకపాత్ర అని వార్తలు వస్తున్నాయి. ఈ మూవీలో నటిస్తున్న హీరోయిన్ల కంటే కూడా సాయికుమార్ పాత్రకీలకం అని అంటున్నారు. ‘జై’ పాత్రకు రైట్ హ్యాండ్ లాగా సాయికుమార్ పాత్ర ఉంటుందని తెలుస్తోంది.

ఎన్టీఆర్ నటించిన ‘జనతా గ్యారేజ్’ లో ఒక ముఖ్య పాత్రను సాయికుమార్ చేసిన నేపధ్యంలో అప్పటి సాన్నిహిత్యంతో ఎన్టీఆర్ ‘జై లవ కుశ’ లో కీలక పాత్రకు ఎంపిక అయినట్లు సమాచారం. నిన్న సెన్సార్ పూర్తి అయిన తరువాత సెన్సార్ సభ్యులు ఈసినిమా దర్శక నిర్మాతలతో మాట్లాడుతూ ఈ సినిమాలో జూనియర్ నటన తరువాత సాయికుమార్ నటనకే ప్రేక్షకుల నుంచి ఎక్కువ మార్కులు పడతాయి అని కామెంట్ చేసినట్లు టాక్.

ఈసినిమా తరువాత సాయికుమార్ కు మరిన్ని అవకాశాలు వచ్చే అవకాసం ఉంది అంటున్నారు. హీరోగా సాయికుమార్ కొడుకు ఆది పెద్దగా రాణించలేక పోయినా తిరిగి సాయికుమార్ ట్రాక్ లోకి వస్తున్నాడు అనుకోవాలి..