మరో 8 రోజులలో విడుదల కాబోతున్న ‘జై లవ కుశ’ మ్యానియా తార స్థాయికి చేరిపోయింది. ఇప్పటికే ఈసినిమా కథకు సంబంధించిన లీకులు అనేక సార్లు బయటకు వచ్చాయి. ఇప్పుడు ఈసినిమా ముగింపుకు సంబంధించిన మరో లీక్ ప్రస్తుతం ఇండస్ట్రీ సర్కిల్స్ లో హడావిడి చేస్తోంది.

చిన్నతనంలోనే నాటకాల కంపెనీని ‘జై’ తగులబెట్టి వెళ్లడం ముగ్గురు ఎవరికి వారు మిగిలిన వారు చనిపోయారని అనుకోవడం కానీ అంతలోనే లవుడు – కుశుడు కలవడం ఆనందంగా ఉన్న సమయంలో ‘జై’ సీన్ లోకి రావడంతో కథ ప్రీ క్లైమాక్స్ కు చేరుకుంటుంది. అయితే క్లైమాక్స్ లో ‘లవుడు కుశుడు’ కలిపి ‘జై’ ని చంపి ఆ క్యారెక్టర్ ను ముగించినట్లుగా ఒక క్లైమాక్స్ ముందు తీసారట.

అయితే ఈ క్లైమాక్స్ ప్రేక్షకులకు అంత బాగా నచ్చదు అన్న ఉద్దేశ్యంతో మార్పులు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ‘జై’ లాంటి పవర్ ఫుల్ క్యారెక్టర్ ను అంతం చేస్తే ప్రేక్షకులు ఆ ముగింపును అంగీకరించేలా సీన్స్ లేవని ఇప్పుడు కొన్ని మార్పులు చేసినట్లు వార్తలు వస్తున్నాయి.

దీనితో ‘జై’ లవకుశలో విషాదాంత ముగింపు ఉంటుంది అని మొదట్లో వచ్చిన వార్తలకు ఇప్పుడు చెక్ పడుతోంది. అయితే ముగింపు మార్చారు అన్నది వాస్తవమే అయినా ఏ విధంగా ముగించారు అన్న విషయమై ఈసినిమా టీమ్ ప్రస్తుతానికి డార్క్ సీక్రెట్ మెయిన్ టైన్ చేస్తున్నట్లు టాక్. ఇది ఇలా ఉండగా ఈమూవీ ఫాస్ట్ కాపీ రెడీ అయినట్లుగా వార్తలు వస్తున్నాయి.

తెలుస్తున్న సమాచారం మేరకు ఈసినిమా నిడివి 2గంటల 35నిమిషాలు వచ్చింది అన్న వార్తలు బయటకు వస్తున్నాయి. నిడివిలో ఎటువంటి మార్పులు లేకుండా రేపు ‘జై లవ కుశ’ సెన్సార్ పూర్తి అవుతుందని అంటున్నారు. సెన్సార్ తరువాత ఈసినిమా విషయమై మరిన్ని లీకులు వచ్చే ఆస్కారం ఉంది..