‘కన్ను కన్ను కలిశాయి.. ఎన్నో ఎన్నో తెలిశాయి’ అంటున్నారు నందమూరి బాలకృష్ణ. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘పైసా వసూల్‌’. పూరీ జగన్నాథ్‌ దర్శకుడు. శ్రియ, ముస్కాన్‌ సేథి, కైరాదత్‌ కథానాయికలు. ఈ చిత్రంలోని ‘కన్ను కన్ను..’ అనే పాట టీజర్‌ను శనివారం విడుదల చేశారు. దీన్ని చిత్ర బృందం సోషల్‌మీడియా వేదికగా పంచుకుంది.

‘‘పైసా వసూల్‌’ కేవలం మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా భావిస్తున్న వారి కోసం ఈ మెలోడీ సాంగ్‌ అని పేర్కొంది. యూత్‌ఫుల్‌ బాలయ్య, బ్యూటిఫుల్‌ శ్రియ.. అనూప్‌ రూబెన్స్‌ స్వరపరిచిన ఈ పాటలో సందడి చేశారని చెప్పింది. భవ్య క్రియేషన్స్‌ పతాకంపై వి. ఆనంద ప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సెప్టెంబరు 1న చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.