Pawankalyan-Flexy

మరికొద్ది సేపటిలో పవన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యంత్రి చంద్రబాబునాయుడును తన హార్వార్డ్ బృందంతో కలిసి విజయవాడలో చంద్రబాబుతో భేటీ కానున్నాడు. ఈ భేటీకి విపరీతమైన ప్రాముఖ్యత ఏర్పడటంతో మీడియా దృష్టి అంతా ఈ కీలక సమావేశం పైనే ఉంది.

అయితే ఈ హడావిడి మధ్య అభిమానులు ఏర్పాటు చేసిన పవన్ ఫ్లెక్సీని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ద్వంసం చేసినట్లుగా వార్తలు రావడంతో పవన్ అభిమానులు తీవ్ర ఆగ్రహానికి గురి అవుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. దీనితో విజయవాడ భవానీపురం శివాలయం సెంటర్‌ లో ఉద్రిక్తత ఏర్పడినట్లు వస్తున్నాయి.

అయితే ఈ సాహసం ఎవరు చేసారు అన్న విషయమై క్లారిటీ లేకపోఅవడంతో ఆ ప్రాంతంలోని సీసీటీవీ కెమెరాల ఫుటేజీని ఆధారంగా చేసుకుని నిదితులను పట్టుకునే పనిలో పోలీసులు ఉన్నట్లు సమాచారం. ఇది ఇలా ఉండగా ఈరోజు ఉదయం పదకొండు గంటల సమయంలో చంద్రబాబుతో పవన్ భేటీ అయ్యే అవకాశముంది అన్న వార్తలు వస్తున్నాయి.

ఈమధ్య కాలంలో పవన్ చంద్రబాబుల మధ్య దూరం పెరిగింది అని వార్తలు వస్తున్న నేపధ్యంలో ఈ భేటీకి అత్యంత ప్రాముఖ్యంత ఏర్పడింది. ఉద్ధానం ప్రాంతంలో కిడ్నీ సమస్యలకు సంబంధించి హార్వార్డ్ నిపుణులు వెల్లడించిన విషయాలను ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలిపిన తరువాత వీరిద్దరూ అనేక కీలక విషయాల పై చర్చలు జరుపుతారు అని కూడ అంటున్నారు.

ప్రస్తుతానికి పవన్ తెలుగుదేశం పార్టీని తన సన్నిహిత రాజకీయ నేస్తంగా చూస్తున్న నేపధ్యంలో ఈ సమావేశంలో వీరిద్దరూ ఉద్దానం సమస్య కాకుండా మరి ఏ ఇతర విషయాలు అయినా మాట్లాడుకుంటారా లేదా అనే విషయమై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతానికి చంద్రబాబు పవన్ ను దూరం పెట్టె స్థితిలో లేని నేపధ్యంలో పవన్ భేటీని తన భవిష్యత్ రాజకీయ అవసరాల కోసం చాల వ్యూహాత్మకంగా మలుచుకునే అవకాశం ఉంది అని అంటున్నారు..