Jagan-Akhilpriya

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి నంద్యాల ప్రచారంలో బుధవారం మంత్రి అఖిలప్రియ పేరును పెద్దగా తీయలేదు. ఆయన పదేపదే సీఎం చంద్రబాబును టార్గెట్ చేశారు. అయితే చాలా మంది అక్కడి వచ్చిన వాళ్లు అఖిల ప్రియ చేసిన పనులను, తన తండ్రి చేసిన మోసాన్ని ప్రస్తావిస్తారని అనుకున్నారు. అక్కడున్న లోకల్ నాయకులు కూడా అదే అనుకున్నారు. కానీ జగన్ ఒక్కసారంటే ఒక్కసారి కూడా అఖిల ప్రియ పేరు చెప్పలేదు. దీంతో ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తన పేరు ప్రస్తావించనందుకు అఖిల కూడా కాస్త నొచ్చుకున్నట్టుగా తెలుస్తోంది. కనీసం పేరు ప్రస్తావించేందుకు కూడా అర్హురాలి కానీ అని బాధపడ్డదంట.

జగన్ రైతు నగరం, కానాల, కొట్టాల, జూలపల్లె, పసురుపాడు, తేళ్లపాడు తదితర గ్రామాల్లో రోడ్డు షో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. టిడిపి ఎమ్మెల్యేలు గెలిచిన 102 నియోజకవర్గాల్లో గానీ, మంత్రుల ప్రలోభాలతో ఆ పార్టీలో చేరిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లోగానీ అభివృద్ధి జరగడం లేదన్నారు. నంద్యాల్లో అభివృద్ధి చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు పోజు కొడుతున్నారని జగన్ ఎద్దేవా చేశారు.

నంద్యాల చుట్టుపక్కల నియోజకవర్గాల్లో ప్రజలంతా వాళ్ల ఎమ్మెల్యేలు ఎప్పుడు పోతారా అని ఎదురుచూస్తున్నారని సాక్షాత్తూ భూమా నాగిరెడ్డి బావమరిది అన్నారని దుయ్యబట్టారు. కనీసం అప్పుడన్నా ఉప ఎన్నికలు వస్తాయి, వైసిపి పోటీ పెడుతుంది, అప్పుడైనా చంద్రబాబు నిద్ర లేస్తారన్నది ప్రజల ఉద్దేశమన్నారు. చంద్రబాబు అబద్దాల కోరు అన్నారు. చంద్రబాబుకు ఓ ముని శాపం ఉందని, పొరపాటున ఆయన నోటి వెంట నిజం వస్తే తలవేయి ముక్కలవుతుందని, అందుకే ఎప్పుడూ నిజం చెప్పరన్నారు.